పుట:Telugu merugulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

తెలుఁగుమెఱుంగులు


హ స్థానమున నేఁటి ళను, అనంగా కర్ణాటకపు హ కారమును ఉంచునది. హ తలకట్టు, దీర్ఘము కలిగియున్నది గాన దానిని దొలఁగింపఁదగును. క్షకారము కష సంయుక్తాక్షరము గాన దానికి వేఱురూప మనావశ్యకము. ఇట్లు తీర్చగా నంతస్థమలు, ఊష్మలు నిట్లేర్పడును. (చిత్రము చూచునది). ఈ మార్పు వలన యాదళాంతమగు పది యక్షరములలో మూఁ డక్షరములు దగ్గినవి. ఒక నిర్మాణ క్రమ మేర్పడినది.


గుణితము

అజ్ఞుణితము: - అజ్ఞుణిత చిహ్నము లెల్ల అచ్చులు నేర్చుకొనుట లోనే వచ్చినవిగాన బాలుర కిఁక హల్లులలోఁ దలకట్టు ఆకారస్థానీయ మనియును తక్కిన యచ్చులకెల్ల అకారముమీఁదఁ బెట్టిన గుర్తులే పెట్టిన సరిడు ననియుఁ జెప్పి, క్షణములో అజ్ఞుణితమును నేర్పవచ్చును.

ముద్రణమున తలకట్టు, దీర్ఘాదీస్వరచిహ్నములు వేఱువేఱుగా నిర్మించి (కన్నడలిపికిఁబోలె) చేర్చవలెను. దీనిచే ఒక్కొక్క హల్లునకును అజ్ఞుణితము క్రింద నిప్పుడు వ్రాయఁబడుచున్న ప్రత్యేకాక్షరములు పదేసి పదేసి తొలఁగిపోవును. దీనిచే అచ్చుపోఁతలోఁ గల యమితభారము తప్పి పోవును. హల్గుణితము: - ఉచ్చారణ రీతికి విరుద్ధముగాకుండ లిపిరీతి యుండవలెను గాన, హల్సంయుక్తాక్షరములందు కడపటి హల్లుమీఁదనే అచ్చు ఉండవలెను. కడపటిహల్లే పూర్ణాక్షరముగా నుండవలెను. తత్పూర్వపుహల్లులు తలకట్టు లేనివిగా (అనఁగా హల్మాత్రములుగా) నుండవలెను. (తలకట్టు తొలఁగిన హల్లులు హల్మాత్రములు). ఒక యక్షరముక్రింద నొక యక్షరము నిఱికించుట యనువిధానము మాసవలేను. లిపులెల్లఁ బ్రక్క ప్రక్కలనే ఉండవలెను. అనఁగా నిట్లు.