పుట:Telugu merugulu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

161


యక్షరములను ఒత్తి పలుకవలెనన్న విషయము తృటిలో బాలుర హృదయముల నాటి నెలకొనును. క నేర్చినవానికి, దాని ప్రక్కనే ఒత్తుగీత గల యక్షరమును ఖ నుగా గుర్తించుట, ఉచ్చరించుట కడు సులభము. వర్గ, ద్వితీయచతుర్ధాక్షరములెల్ల నిట్లే సులువుగా నేర్వఁదగిన వగును. భిన్నభిన్న రేఖలతోఁ క్రొత్త లిపులను దిద్దుట, యుచ్చారణమును జ్ఞప్తియం దుంచుకొనుట యను కష్టము లుండవు. వర్గతృతీయాక్షరము ముక్కుమూసికొని యుచ్చరించినచో వర్గపంచమాక్షరమగుట నుచ్చారణ శక్యనుసారముగా బాలురకు నేర్పుటగును. దీనినిబట్టి యిరువది యైదు వర్ణాక్షరములలో బదిమాత్రమే కొద్దీ నేర్వవలసినవి. తక్కినవి కడుసులభముగా జ్ఞాపకమునం బెట్టుకొని రెండు ఒత్తుగఁతల భేదముతో, తలమీఁది చంద్రవంకతో వ్రాయఁ దగినవియగును. వర్గాక్షరములెల్ల నొక్క నిర్మాణక్రమము గల వగును. ఇట్లు మార్పఁగా ముద్రణమునఁగూడ నిర్వదియైదు వర్గాక్షరము లలోఁ బదునై దక్షరములు దగ్గిపోవును. వర్గద్వితీయచతుర్ధాక్షరముల నచ్చునఁ గూర్పవలసినప్పుడు, వర్గప్రథమతృతీయాక్షరములఁగూర్చి వాని ప్రక్క నంటి యొక్క నిలువుగీత (1) అంకెను జేర్చిన సరిపడుము. వర్గ పంచమాక్షరమునకు వర్గతృతీయాక్షరము తలకట్టు నొట్టు నట్టు చంద్రకళ చేర్చినఁ జక్కఁబడును.


అంతస్థములు. ఊష్మలు


య-కుఁ గల కొమ్మును దొలఁగింపవలెను. ర-కే ప్రక్కసు ఓత్తిచ్చినచో బండి ఱ అగును. ల-కు తలక ట్టుండవలెను. ల-కే ప్రక్కను ఒత్తిచ్చినచో ళ ఆగును. వ-ను ప-ను గాఁ జేసితిమి గాన వ స్థానముఁ క్రొత్త యక్షరము వ్రాత 'వ' చేర్చవలెను. శ యథాపూర్వమే. శకు ప్రక్కను ఒత్తిచ్చి నచోష అగును సస్థానమున స యుంచునది.