పుట:Telugu merugulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూస:Rhతెలుఁగుమెఱుంగులు


ఇట్టి చిక్కె కలదు. ప్రైమరీ స్కూళ్ల పంతులవారు కొందరు 'కృ కు కకార అకార ఋకారములు 'క' అని వర్ణక్రమము చెప్పుటను వింటిని. వారట్లు చెప్పుట వింతగాదు. వట్రువసుడి 'స్వ' ఒత్తులవలె హల్లుగాఁ దలఁపx బడు ననియేకదా కొందఱు లాక్షణికులుగూడ అది యున్నహల్లు తక్కిన యచ్చులతోనున్న యా హల్లుతోఁ బ్రాసమునఁ జెల్లునని చెప్పిరి! కనుక కోమ్ము, కొమ్ముదీర్ఘము వట్రువసుడి, వట్రువ సుడి దీర్ఘము ఉన్నప్పుడు హల్లుకు తలకట్టు ఉండుట అక్రమము.

ఇక హల్గుణీతములో 'వాక్స్వాతంత్ర్యము' అను పదము వ్రాయునప్పుడు 'క్స్వా' లో కకార సకారములు హల్మాత్రములు. వకారము ఆ కారముతో గూడినది. 'క్స్వా' ను విడఁదీసినచో 'క్,స్,హ' అగుసు. కాని మనము లిపిలో ఆకారమును కకారముమీఁదనే ఉంచుచున్నాము. సకారవకారములను క్రింద ఒత్తులనుగా ఉంచుచున్నాము. బడిపంతుళ్లును, గొందఱు పండితులునుగూడ 'క-కు దీర్ఘమిస్తే కొ' కా - కింద సావత్తిస్తే క్సా, క్సా-కింద వాపత్తిస్తే క్స్యా' అనియు 'క కార ఆకార సకార వకారములు క్స్వా అనియు వర్ణక్రమము చెప్పుచున్నారు. ఇది తప్పు గాదా! నాగరాక్షరములు ఈ విషయమున ఉచ్చారణరీతి ననుసరించి సరిగా నున్నవి. ఆ లిపిలో సంయుక్తాక్షరమునఁ గడపటిహల్లుమీఁదనే య చ్చుండును. తత్పూర్వము గల్గుహల్లులు అర్ధాక్షరచిహ్నములు గలవిగానే ఉండును. బాలురకు లిపి నేర్పుటలో నిట్టి చిక్కులు గలవు, అలవాటు పడియుంటిమి గనుక నేఁడు మన కివి యంతగాఁ జిక్కు గూర్చునవిగా దోఁపకపోవచ్చునుగాని బాల్యమునఁ దొలుత నేర్చుకొనునప్పుడు మనల నెల్లరనుగూడ నీ చిక్కు బాధించియే యుండుట వాస్తవము. ఎంత యలవాటయినను బ్రౌఢులనుగూడఁ గొందఱు నీ చిక్కులు బాధించుచునే