పుట:Telugu merugulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


15

ఆంధ్రలిపి సంస్కారము

నేఁడు వాడుకలో నున్నమనతెనుఁగులు మనకు మిక్కిలి చిక్కులు గలిగించునదిగా సున్నది. పసిబాలురకు లిపినేర్పుటలో క్లేశము గలదు. గ్రంథముల సచ్చొత్తించుటలో క్లేశము గలదు. టైపులైటింగునిర్మాణమున కసౌకర్యముగలదు. అంతేకాక వరోచ్చారణ రీతికిఁగూడ విరోధము గలదు. ఇవి యెల్లఁ జిన్నచిక్కులు కావు. వీనిని గొంత వివరింతును.

1.బాలురకు నేర్పుటలో క్లేశము


అచ్చులలో హ్రస్వదీర్ఘములగు అ, ఆ లు ఈషద్భేదముగల సమానలిపులై యుండఁగా ఇ, ఈలు పోలికయే లేనివిగా నున్నవి. అందు ఇ చవర్గాంత్యాను నాసికమగు ఇ-తో పోలిక గలది. ఋ, ౠలు బు,బూల పోలిక గల వై రెండు కొమ్ములు గలిగి పొందికలేక మెలిటుగా నున్నవి. ఒ,ఓ, ఔ లు జ--తో పోలిక గలవి. ఇఁక హల్లులలో కవర్గమెల్లం బోలికయే లేని భిన్నలిపులతో నున్నది. ఖ-కు తలకట్టు లేదు. ఘ - 'ఫ,పుషషు' అక్షరముల పోలిక గలది. చవర్గమున చఛలు పోలిక గలిగియున్నవి. కాని జఝులు భిన్నములుగానే యున్నవి. జ-కు తలకట్టు లేదు. అది ఒఓ ఔల పోలిక గలది. ఝరుడు వర్ణముల పోలిక గలిగి రెండు కొమ్ములు గలిగి యసందర్భముగా నున్నది. ఇ* ఇకారముతోఁ బోలిక గలది. టవర్గమున ట,రలు పోలిక లేనివి.డ ఢలు చఛల వలెఁ బోలిక గలవి. ణ తలకట్టు లేనిది. క, చవర్గముల యంత్యానునాసికములు జ, ఆ లు తలకట్టు లేనివి. అవి చిహ్నము గలవై యుండఁగా ణ-కు