పుట:Telugu merugulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


13

ఎఱ్ఱాప్రెగడ రామాయణము

చదలువాడ యెర్రా ప్రగడ భారతారణ్వపర్వ శేషమును, రామాయణమును, నృసింహపురాణమును, హరివంశమునురచియించెను. హరివంశమున నిట్లున్నది:


శా."నా తమ్ముండు ఘనుండు మల్లరధినీనాధుండు ని న్నాతత
శ్రీ తోడన్ సముపేతుజేసి యేలమీన్ జేపట్టి మా కిచ్చుటన్
జేతోమోద మెలర్ల రామకధ మున్ జెప్పించి యత్యుత్తమ
ఖ్యాతిం జెందితి నింకనుం దనియ నేర గా వ్యామ్మృతాస్వాదసన్, "


దీని బట్టి రామాయణము హరీవంశమునకుఁ బూర్వకృతి యనియు, నది ప్రోలయ వేమారెడ్డి గారి ప్రేరణమున రచితమయ్యే ననియుఁ దెలియనగును.

  • వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్రప్రబంధంబుఁజేసె"


నని యేర్రా ప్రెగ్గడవంశమువాఁ డీటీవలిపోఁడు చదలువాఁడ మల్లయకవి చెప్పినాఁడు. దీనినిఁబట్టి యా రామాయణము సంగ్రహరూప మయినదిగాక సకలవర్ణనాపూర్ణమయిన, సంస్కృతరామయణానుసారి యయిన ప్రశస్త ప్రబంధముగా దెలియనగును.

ఇట్టి యెర్రా పెగ్గడ రామాయణ మిప్పుడు గాన రాదు. లక్షణ గ్రంథములలో నెర్రాపెగ్గడరామాయణ పద్యములు పెక్కు లుదాహృతము లయియున్నవి. -2. కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసం గ్రహమున ఎర్రా ప్రెగ్గడ రామాయణములోని వని యీ క్రింది పద్యములు సుదాహరించినాఁడు: