పుట:Telugu merugulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రస్తుతం జయంతి సందర్భంగా ముద్రిస్తున్న పుస్తకాలు, శ్రీశాస్త్రిగారు ఆయా సందర్భాల్లో గావించిన ఉపన్యాసాలూ, సమర్పించిన పత్రాలూ ఒకచోట చేర్చి - అనేకాంశాలపై నున్న వ్యాసాలు. ఇందులో ఆంధ్రసాహిత్యం సారభూతంగా ఆణిముత్యాల్లాంటి శీర్షికలో - సాహితీ ప్రియులకు హృదయానందాన్నీ, నూతన ఆలోచనలనూ, విమర్శనధోరణినీ - త్రివేణీ సంగమంలాగా - నింపుతుంది.

ఈ వ్యాసాల్లో శాస్త్రిగారి సంగీత, సాహిత్య, వేదాంత. భాషాశాస్త్రాది బహుముఖీనమైన ప్రజ్ఞా వైశిష్ట్యం సర్వత్ర గోచరిస్తుంది. శాస్త్రిగారు కొన్ని గ్రంథాల్లో స్వయంగా రాసుకున్న "చిత్తు వాతలు" పరిశోధకులకు ఎంతో ఉపకరిస్తాయి.

అన్నమయ్య కీర్తనలను వెలుగుకు తేవడంలో శ్రీశాస్త్రిగారి కవి ప్రశంసనీయం!

శ్రీ శాస్త్రిగారి వాజ్మయపీఠాన్ని నెలకొల్పి. ఆందుకు తగిన సంపూర్ణ సహకారం అందిస్తున్న తీరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు గౌరవశ్రీ భూమన కరుణాకరరెడ్డిగారికీ, గౌరవ పాలకమండలి సభ్యులకూ, కార్యనిర్వహణాధికారి మాన్యశ్రీ కె.వి. రమణాచారి. ఐ.ఏ.ఎస్. గారికీ, ఇతర అధికారబృందానికి, శ్రీ శాస్త్రిగారీ గ్రంథాలయాన్ని పీఠానికి సమర్పించిన శ్రీ శాస్త్రిగారి కుమారుడు ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారికీ, శ్వేత, కేంద్ర గ్రంధాలయం మరియు పరిశోధన సంస్థ తరఫున ధన్యవాదా లర్పిస్తున్నాను. సాహితీప్రియుల ఆదరప్రోత్సాహాలతో ఈ వాజ్మయపీఠం ఇతోధికంగా సాహితీసేవలో ధస్యమవుతుందని ఆకాంక్షిస్తున్నాను. ముద్రణ విషయంలో డి.టి.పి. చేసి యిచ్చిన 'మూనివర్సిటీ జెరాక్స్' వారికీ, సకాలంలో ముద్రించియిచ్చిన తి.తి.దే. ముద్రాణాలయం వారికీ, ముద్రణ విషయంలో నిరంతరం శ్రమించిన - వాజ్మయ ఓం సమన్వయకర్త డా|| పి. చెంచుసుబ్బయ్య గారికీ ధన్యవాదాలు.

- భూమన్