పుట:Telugu bala Satakam PDF File.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు బాల శతకం

1. వేకువందు లేచి వేడ్క గాపాఠాలు
చదువుచుండవలయు చక్క గాను
ఉదయసమయ పఠన ముత్సాహమిచ్చును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


2. బడికి వెళుటకును గొడవ చేయగరాదు
తల్లిదండ్రి మాట తప్పరాదు
పెద్దవారి మాట పెన్నిధి సమమమౌను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


3. గురువు పలుకులెల్ల గురుతుగా గమనించి
పదిలపరచుకొనుము హృదయమందు
 చిన్ననాటీగుర్తు చితమ్ము వీడదు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల


4. తోిటీవారి తోడ పోటీలు పడుచుండ
విద్య వృద్ధి యగును వెలుగు కలుగు
ఈర్ష ఉండరాదు ఇతరపిల్లలపైన
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


5. అడగ వలయు విషయమర్ధమ్ము గాకున్న
తెలివి పెంచు ప్రశ్నలైన తేజమొసగు
చిలిపి ప్రశ్నలైన చేటును కలిగించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


6. పుసకములలోని పుణ్యశీలుర కధల్‌
చదువు చుండ వలయు సరసరీతి
ఘనుల జీవితములె ఘనమార్గములు చూపు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం


7