Jump to content

పుట:Telugu bala Satakam PDF File.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

91. ఆకలన యపుడె ఆరగించవలయు
ఒక్కసారి నోటకుక్కరాదు
నమలి నమలి మ్రింగ నమరునారోగ్యమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

92. నమ్మకమ్ము వలయు నరునిపై నరునకు
నమ్మలేనినాడు వమ్ముబ్రతుకు
గుడ్డినమ్మకమ్ముగొడవలు సృషించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

93. విద్యలోన నెట్టి విషయమ్ములైనను
కష్టమనుచుతోచ విష్టమున్న
శ్రద్ధ పెంచుచుండు శుద్ధగురులబోధ
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

94. తనను మించున్టి ఘనుడులేడనినమ్మి
విఱ్రవీగు టెల్ల వెర్రితనము
తాడి దన్ను వాని తలదన్ను వాడుండు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

95. పుస్తకాలు చదువ పోవును కోపమ్ము
పుస్తకాలు చదువపుట్టు తెలివి
పుస్తకాల రచన పుట్టించు సత్కీర్తి
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

96. మనసులోన విషము మాటలో నమృతము
చూపునట్టివాడు సుమతి కాడు
త్రికరణంపు శుద్ధి తేజమ్ము హెచ్చించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.22 తెలుగు బాల శతకం