పుట:Telugu bala Satakam PDF File.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

61. ఆచరించ వలయు నభ్య సించిన విద్య
ఆచరించకున్న నగును చేటు
అనుభవమ్ము లోనె అలరారు విద్యలు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

62. స్వార్ధరహతమైన సాంఘక సేవయే
శ్రేష్ట మతమటంచు చెలగుమింక
సేవ వలన కీర్తి చేకూరునెప్పుడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

63. పరుష వాక్కులెపు డు పల్కకుండుటమేలు
కరినమెన మాట కాల్చు నరుని
మంచి వాక్కు తోడ మన్ననల్‌ ప్రాప్తించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

64. విద్య నేర్చునపుడె విపులాశయమ్ములు
కలిగి యండవలయు కాంక్షచూపి
ఆశసిద్ధి కలుగు నహరహముశ్రమించ
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

65. ధనము వచ్చుచుండు తరిగిపోవుచునుండు
విద్యయనెడి ధనము హృద్యమగుచు
శాశ్వతముగ నిల్చి సత్కీర్తి యొసగును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

66. బురదలోన పుట్టు పుష్పమ్ము వెదజల్లు
సౌరబమ్ము నెపుడు చక్క గాను
పుట్టు నెలవు కాదు పూతగుణము చూడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం
 

17