పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హీనుడగుటగాని, శాపవశమున గాదనియు సుఖరోగముచే ననియు మావాదము. అది స్వభావసిద్ధమును ఇతడు సర్వదా సర్వధా వ్యభిచారి, వ్యభిచారిణీసమాజమునకు నాయకుడు. రంభాదులే యితనికి కార్య సాధములు. వ్యభిచారమే ముఖ్యవృత్తియై యవి వేదోక్తములనిపించి ప్రభువుల నోళ్లుగట్టి యాగాదులమూలమున విచ్చలవిడిగా మిండఱికము చేయుచుండు వారికిట్టి వాడు గాక మఱియొకడు దేవరాజ్య పట్టాభిషిక్తుడైనచో తమయాటలు సాగునా? పూర్వదేవతలయొద్ద తమ యసహ్యకార్యములు సాగక పోవుటచేతనే వారిని పదభ్రష్టుల గావించుటయు, ఆస్థానమున అపరదేవతల నిలుపుటయు మునులకు తప్పని సరియైనది.

ఒకరాజ్యమున కధికారియగు వాని కెన్ని సుగుణములుండ వలయునో అందొక్కటియైన నింద్రునకున్నదా?

మిండఱికములో నింద్రుడందెవేపినచేయి. మాయలలోనదమా? అతని మించినవారులేరు. తమమాయలన్నియు వేరోక్తములనియు రాక్షసుల కార్యములన్నియు వేదబాహ్యములనియు కపటయుక్తములనియు లూలా మాలపుమాటలచే లోకము నోరుమూయుటకు తమకు ఫీజులేని వకీళ్లు మునులుండగా నీ చిన్న దేవతల కేమికొదువ? ఏదితప్పు? ఏదిఅయుక్తము? యెయ్యదకార్యము? అన్నియు వేదోక్తములే శాస్త్ర సమ్మతములే.

అసూయలో సైత మగ్రతాంబూలముగొన నర్హుడింద్రుడే. యజ్ఞ విధ్వంసకులని రాక్షసుల నగడుపఱచిన ఋషులు పృధుని సగరుని యజ్ఞములను మఱియు నెందఱివో యజ్ఞాములను పాడుచేసిన క్రతుభుక్ర్పభునేల అగడెత్తింపలేదు? స్వార్థపరత్వమున మఘవుని చెప్పి మఱియొకరిని చెప్పవలయును. తననెత్తికి పిడుగులై వత్తురని రాజుల యజ్ఞములను వినాశ మొందించుటయు రాక్షసులతపస్సుల పాడొనరించుటయు శతక్రతుని నిత్యకృత్యములు. మొదటియజ్ఞ విధ్వంసకుడు శివుడు. అతడు రాక్షసపక్షపాతి. అట్లయ్యును ఎల్లకాపరిగానుండు వాడు గావున నతని నగడెత్తించిన తమకే పెక్కుచిక్కులు కలుగుననియే యతని కార్యములను ధర్మయుక్తములని సమర్థించుచు వచ్చిరి.

ఇంద్రుడు మహాశూరుడు కావున దేవరాజ్యార్హుడందమా? ఏరాక్షస ప్రభునొద్ద నతడోడకుండినది? దినగండము నూఱేండ్లాయు