పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నట్లింద్రుని వైభవము సర్వకాలములయందు సుస్థిరము కాకయుండెడిది. ఒక్కొక్క రాక్షసుడు దండెత్తివచ్చి దేవతల్ నడవులకు బాఱదోలి స్వరాజ్యమైన స్వారాజ్యమును గైకొన్నపుడు మునులు నింద్రునిడుచేరి "మాయాగారికార్యము లెల్ల విధ్వంసమయ్యెను. దేవరాజ్యం పూర్వ దేవతల యధీనమయ్యెను. లోకము పాడుపడియెను." అనిబ్రహ్మతోమొఱలిడుటయు అతడు వారిని విష్ణువుపాలికి గొనిపోయి మొఱ్ఱవెట్టి మొత్తుకొనుటయు అతడొక తంత్రము పన్ని ఆసత్కాలము నందు సైతము శూరధర్మము నీడన యమాయాకులగు పుణ్యజనుల నంతమొందించి దేవతల యధాస్థానమున నిలుపుటయు సూటికిమాటికి జరుగు చుండునని మున్నే చెప్పి యున్నారము వీరివలె వాఱును అధర్మమార్గమున సంచరించు వారై యుండినచో దేవతలేనాడో పేరులేక నశించియుండువారే. వంచకుల మాయలు అమాయకుల యెద్దనే గదా సర్వతో ముఖముగ జెల్లుబడి యగుచుండును.

   ఇట్టి పరమ శూరుడు, పాతివ్రత్య విధ్వంసకుడు తపోనిష్నుకారి అక్రమ ప్రవర్త కుడే దేవతారాజ్యమునకు సర్వవిధముల నర్హుడు కావలయు. పరీక్షించి యున్నత పదవులీయ నిట్టికార్యము లొనర్చె ననుకొందమన్నను పురాణము లట్లు చెప్పుటలేదు.  అహల్యకు కేవలం కామియై మొసగించి చెఱిచెను.  రాక్షస్ల తపస్సులే కాక విశ్వామితాది మహర్షుల తపస్సులనుకూడ తన కొంప కేదో ముప్పువచ్చునను భయముచే స్వార్ధపరుడై చెఱప బూనెను.
    ఎన్ని తప్పులుచేసినను ఎంతనీచ ప్రవర్తకుడైనను ఇంతకంటె తమ కను కూలుడు, ఆత్మోన్నతి వీడినవాడ్, చసలుడు, కీలుబొమ్మ దొరకడనియే ఋషు లితనినే దేవరాజ్యపదమున పడరానిపాటులుపడి నిలువబెట్టుకొనుచుండిరి. ఓకప్పుడేదోతిరస్కారభావమునబ్రవర్రించెననిమునులింద్రుని పదభ్రష్ణునిగావించి యాచోట నహుషుని నిలిపిరి.  వారి యష్యవర్తనములు కొన్నాళ్లలోనే నహుషు నకు  వెగటుపుట్టించెను. అంతనతడు వారి చర్యల నిర్బీకుడై ఖండింప బూనగా నతనిపై లేనిపోని యపనిందలు మోపి మునులతని పదభ్రష్టుని గావించిరి.
 నహుషుడు శచిని గొరినది నిజమా? ఇంద్రుడు పదచ్యుతుడై యడవులబడి తిరుగుచున్నప్పుడు వానిభార్య వానితో దిరుగక యింట