పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందర్బమున నటించిన బీభత్సరసమును, రామదాసు నిర్భంధితుడై కొరడాలచే మోదబడినపుడు నటించిన శృంగారరసమును, వీరరసమును, ఉత్తరుడు కౌరవ సేననుచూచి నటించిన కరుణారసమును, శాంతరసమును చూడతగిన రంగములు.

ముఖ్య పాత్రలు;--

బృహన్నల:- పూర్వసువాసినీ ఆంధ్రరంగ ధ్వంసోద్ధారక నిరక్షకుక్షి బిరుదాంకితులగు, బుచ్చయ్యగారు.
బాహుకుడు: పండితపుత్ర భావనాశన బాలబాబుగారు.
నలుడు:-నవరస విహీన బిరుదాంకితులగు నరపరాజుగారు.
రామదాసు;- రంగసింహ రామబ్రహ్మంనాయుడుగారు.
లవ,కుశులు:- ఆంధ్రనాటక జీరంగి, బాకా, బిరుదులందిన ముప్పది వత్సరముల వయస్సుగల లేబ్రాయపు ముద్దుబాలురు చిట్టిబాబు, బుచ్చిబాబుగార్లు.
దమయంతి:-దండు దరిద్రాదేవిగారు.
కమల:-కళావిహీన, కలహకంఠి కామేశ్వరిగారు
సీత:-సిరిముక్కుల శివరామాబాయిగారు.
కబీర్:-కబొది కాటంరాజుగారు.
తదితర స్త్రీ పురుషపాత్రలు సమయోచితము. వీరలందరు విధ్యంసులే ?

రేట్లు వివరం

1,2,3 తరగత్లు పురుషులకుచితం.

        1,2,3 తరగతులు స్త్రీలు పురుషులవెంట రావచ్చును.
           బాలురకు 2 x 2 --4.

కంపెనీరూల్సు:- నోటీసు అడిగినవారికివ్వబడదు. రూల్సు అచ్చువేయలేదుగాని విరుద్దముగా నటించువారికి తమలపాకుబీడాలు యివ్వబడును. సిగరెట్టులు, బీడీలు, చుట్టలు, సొడా వగైరాలఖర్చులు తామే భరింపవలయును. టిక్కట్లులెని వాని కేయిక్కట్టులేదు. తరగతిమర్చి తరగతిలో కూర్చున్నవారికి తగుబహుమతు లివ్వబడును. అనుకూలమువల్ల ప్రదర్శన మాపుదలచేసిన యెడల ఉప్మా, టీ ఉచితముగ యివ్వబడును. స్థలము నిండినవెనుక అన్ని తరగతుల టిక్కట్లు అతిత్వరితముగ ఇవ్వబడును.

దరిద్రదామోదర్, రంగధ్వంపక్, కళావిహీన్,

ప్రొప్రయిటరు. స్టేజిమేనేజరు-కండక్టరు. సెక్రటరి.