పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నోటీసు.

                                           గుండ్లపల్లి - సుబ్బారావుగారు.

నేటిరాత్రి ! చౌ ! చౌ ! చౌ ! చౌ ! నేటిరాత్రి !! పేరులేని పెద్దపట్టణమున అమర్చియుండు మాస్వంతడేరాలో అద్భుతము! ఆహ్లాదకరము! చూడవేడుక! శ్రవణానందము!

నేత్రోత్సవము!

చిమటలుకొట్టిన సీనులు! చింపిరిదుస్తులు! ఆరితేరిన రసలుబ్దులు! శ్రుతిహీనపు పాటలు ! వర్ణక్రమములేని వర్ణమెట్టులు !

తాళజ్ఞానముని తదిరతులు !!

"భావప్రదర్శన పూర్ణానుస్వార నవరసనాశన నీరస సభవారిచే"

నేలగట్టుపల్లి కర్ణపిశాచ కవిత్వధ్వంస కాలనాభముగారిచే రచియింపబడిన నవీన సంగీత

"హరి చిత్ర లవ రావ బృహ" అను చౌచౌ నాటకంము

                  ప్రదర్శింపబడును.

తాము బందుమిత్ర సమేతులై వచ్చిచూచి నేత్రపండున గావించుకొందురని మాయాజ్ఞ !

   మాఅక్టర్లు పాడుపాటయున్ను చేయుఆక్టున్ను పరోక్షమున చూచు వారికే నీరల్ సామర్ధ్యము తెల్లము గాగలదు.  వీరలధిక ధైర్య గాంబీర్య సాహసము గలవారలే. పాటలు కర్ణకుహరములు బగుల్చు గార్ధభస్వరముతోను, తాళ భేతాళములతోను, అర్ధరీడ్దు హార్మోనియ విహీనముతోను, ప్రేక్షకులకు రౌద్రోద్రేకము కల్గి ఒడులు జలదరించునట్లు ప్రదర్శింపబడును. హరిశ్చంద్రుడు చంద్రమతిని మాలకమ్మి వెడలునపుడు నటించు హాస్యరసమును, నలుడు దమయంతిని వివాహమాడునపుడు నటించిన రౌద్రరసమును, ఆంజనేయులు శ్రీరామాశ్వమేధయాగ సందర్భమున లవకుశుల మార్కొన్న