పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంచును. ప్రేమ హృదయమందు మేల్కొనినప్పుడు దాని స్పర్శవలన పరులు గూడ ప్రేమికులగుదురు. అసీమ ధైర్యయుతమగునది ప్రేమ." "సత్యవాది యితరులందుండు సత్యమును గాంచగలుగును. మఱియు దానిని గ్రహించును. అసత్యవాదికి ఇతరులయందసత్యముమాత్రమే గోచరించును." "ఖ్యాతిగలవారన, ఇంటను రచ్చను విఖ్యాతులగుటయని గ్రహింపనగును. ఇతరులతప్పులను దిద్దుటకు వ్యర్ధప్రయత్న మొనర్చుటకంటెను తాను విశుద్దుడగుటకు బయ త్నింపవలయును. అందువలన మనస్సు ఉన్నతినిగాంచును; తన స్వభివృద్ది జెందిన కొలదిని మహానుభావుడగును."

"మానవజాతిని సమానభావమున చూచుచుండుటను ప్రేమించుటయని యెఱుంగునది. తనను, మానవజాతిని, సమానభావమున తెలిసికొనుటకు జ్ఞానమందురు."

"మార్గమును చూపించుటతోడ నాయకుల కర్తవ్యము పూర్తిగాదు. అతడు ముందుగా చెప్పనటుల చేసిచూపింపవలయును. నాయకుడు మృత్యుముఖ మందుకూడ విచలితుడుకాడు; వెనుక కడుగిడడం."

"ఉన్నత జీవికుడు జీవించువాని యాదేశములను వెంటనే మానవులు మన్నింతురు. ఉన్నతజీవితము గడుపనివానియాజ్ఞల నెవ్వరును గమనింపరు. మాఱుమాట్లు చెప్పినను చెవిజొరనీయరు." "ప్రేమకు డెప్పుడును విషయముగ నుండును. కర్మిష్టుడై యలరారును. ఉత్సాహము విశ్వాసముల గూడి యుందును. ప్రేమ కపరనామములు సాహసము, శక్తి, సరశత్వము."

"ప్రేమికుడు ఉన్నతభావపూరితుడు. కాని యహంకారికాడు" మహాఉరుషులకు సేవయనర్చవచ్చును. కాని వారిని సంతుష్టిపఱచుట మిక్కిలి కఠినము."

"విశ్రాంతినిగోరువాడును, ఆయాసమును జెందువాడును పండితుడు గాడు."

"హృదయము కలిగినవానికి మాత్రమే శిక్ష నొసంగుము. ఎల్లరను హృదయహీనులనితలంపకు."

"ప్రేమికుడు మిక్కిలి సాహసుడుగ నుండును. అందువలన సాహసుల నందరిని ప్రేమికులని తలంపకుము."