పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నీస్నేహితులెల్లరు నీ క్షేమమును గోరుచున్నారని తలఫకుము నీయందలి దోషములను సవరించుటకు ప్రయత్నించువానినే మిత్రుడని యెఱుంగుము."

"ధనవంతు డహంకారి కాకుండవచ్చును. కాని దరిద్రునకు సంతసము కలుగుట అతికఠినము." "సమయముననుసరించి ప్రసంగమునకు గడంగినచో లోకులు విరక్తి జెందరు.

"సాధుపుంగవుల హృదయము, జీవనము సర్వదా నున్నతగామియై యుండును. కాని యసాధుల హృదయము జీవితము తద్విపరీతము"

"ప్రాచీనులు తమకొఱకు శిక్షను బొందుచుండిరి. నవీనులు ఇతరుల కొఱకు శిక్షను బడయుచున్నారు. మనకు వాక్యములకంటె కర్మశక్తి వృద్ధియగుట ముఖ్యము."

"బ్రతిష్ఠకలుగకుండెనే యని దు:ఖింపకుము. నీయందలి లోపముల కొఱకు పరితపించుము. మిధ్యను, అవిశ్వాసమును ఇతరులకడనుండి యభ్య సింపవలయునను తలంపు లేనివాడే శ్రేష్ఠమానవుడు."

"ఉత్తమశిక్షను నీచులకడనుండి యైనను బడయుట పరులదోషములను గమనింపకుండుట స్వీయావస్థకు సంతసముగనుండుట అనునవి యుత్తమ పురుష లక్షణములు."

"సంసారత్యాగము సర్వశ్రేష్ఠమగు త్యాగము. దేశత్యాగము నిమ్న తరగతికి జెందును.

"ఎంతమంది మానవులు మనస్సును తెలిసికొన గలుగుచున్నారు? విశ్వాసిని సత్యవాదివిగమ్ము. వ్యహారమందు సర్వదా వినయాచరణుడవుగమ్ము"

"దేహముకంటెను మనస్సును మిక్కిలి ప్రేమించుము. ఇతరుల గూర్చి మిక్కుటముగ యోచించకుము. నీలోపల నీవు నిరంతరము చూచు కొనుచుండుము. అదియే శాంతి."

"దూరదృష్టి లేకుండుటవలన అనేకులు మిక్కిలి కష్టముల బొందు చుందురు."

"సాధుపుంగవుడు యశముకంటె సద్గుణము లెక్కుడు కావలయునని