పుట:Telugu Samasyalu 1953.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఆరీతిగాదిట్టి యమపురంబునకును
       నిన్నుఁబంపఁదలంచి యున్నవాఁడఁ

గీ. కాచుకోగా విటుమింద నఖండచండ
దారుణోద్దండకవితాగభీరశ_క్తి, నీతరము. . . 114

  • చరమును రేగ మేక మెడచన్నులవంటివి రెండుమాన్యముల్.

చ. గరిసెలు వ్రాతగానిమఱిగం పెఁడెఱుంగము మన్య దేశముల్
తిరిగి యభీష్టవస్తువులు దెచ్చి భుజింతుము సర్వకాలమున్
సురుచిరసత్కవిత్వనిధి సూరకవీంద్రనకేలగల్గె గం,చర...

  • ఏమి చేయవచ్చు నీశ్వరాజ్ఞ.

గీ. కర మెవరికె నఁ గడఁ దోవ గా రాదు
ధర్మరాజఁ దెచ్చి తగనిచోటఁ
గంకుభట్టుఁజేసె గటకటా ! దైవంబు, ఏమి. . 116

  • కులకాంతకు సాటిరారు గువ్వలచెన్నా.

క. వెలివిద్య లెన్ని యైనను
గులవిద్యకు సాటిరావు కుంభినిలోనన్
వెలకాంత లెంద ఱున్నను, గుల. . . 117

  • రావే ! ఈశ్వర ! కావవే! వరద ! సంరక్షించు భద్రాత్మకా!

శా. లా వొక్కింతయు లేదు ధై ర్యము విలో
లంబయ్యెఁ బ్రాణంబులా
ఠావుల్ల ప్పెను భాంతివచ్చె దనువుకొ
నీవేతప్పనితఃపరంటెఱుఁగ మ
న్నింపందగున్ దీనునిన్, రా. . . 118