పుట:Telugu Right to Information Act.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
(vii) దాని విధానాల రూపకల్పన కోసం, లేక వాటి అమలుకకోసం, పౌరులతో సంప్రదింపులు జరిపేందుకు, లేక వారి ప్రాతినిధ్యం స్వీకరించేందుకు ఏదైనా పద్దతి ఉన్నట్లయితే ఆ వివరాలు
(viii) దానిలో భాగంగా గానీ, సలహాలు ఇచ్చేందుకు గానీ ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువమంది సభ్యులతో బోర్డులు, కౌన్సిళ్లు, ఇతర సంస్థలు ఏర్పాటైఉంటే వాటి వివరాల ప్రకటన: వీటన్నింటి సమావేశాలకు ప్రజలను అనుమతిస్తున్నదీ లేనిదీ; ఆ సమావేశాల వివరాలు ప్రజలకుఅందుబాటులో ఉన్నదీ లేనిదీ,
(ix) దాని అధికారులు, ఉద్యోగుల సమాచార సంపుటం
(x) దాని అధికారులు, ఉద్యోగులు పొందే నెలవారీ వేతనం, నిబంధనల ప్రకారం ఉన్న పరిహారం చెల్లింపు వ్యవస్థ వివరాలు,
(xi) అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, జరిపిన చెల్లింపుల వివరాలు, విడివిడిగా పేర్కొంటూ, దాని కింద ఉన్న అన్ని ఏజెన్సీలకూ కేటాయించిన బడ్జెట్ వివరాలు,
(xii) సబ్సిడీ పథకాల అమలు తీరు, వాటికి కేటాయించిన నిధులు, ఆ పథకాల లబ్దిదారుల వివరాలు
(xiii) అది మంజూరు చేసే రాయితీలు, పర్మిట్లు, అనుమతులు, పొందిన వారి వివరాలు.
(xiv) అందుబాటులో ఉన్న/నియంత్రణలో ఉన్న సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో కుదించిఉంటే...ఆ వివరాలు
(xv) ప్రజల కోసం ఏదైనా గ్రంథాలయ , లేక పఠనాలయం నిర్వహిస్తూ ఉండి ఉంటే వాటి పనివేళలలతో పాటు, సమాచారం పొందేందుకు ప్రజలకున్న సదుపాయాల వివరాలు.
(xvi) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు.
(xvii) నిర్ణయించిన తీరుగా ఇతర సమాచారం ఏదైనా, ఆ తర్వాత ఏడాదికోసారి ఈ సమాచారం అంతటినీ సరిచేసి కొత్తగా ఇవ్వడం.
(సి) ముఖ్యమైన విధానాలను రూపొందించేటప్పుడు గానీ, ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు గానీ వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.
(డి) పాలనాపరమైన లేక అర్థన్యాయ (క్వాసీ జ్యూడీషియల్) నిర్ణయాలకు గల కారణాలేమిటోఆ నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వివరించాలి.
(2) సమాచారాన్ని పొందడం కోసం ప్రజలు వీలైనంత తక్కువగా ఈ చట్టాన్ని ఆశ్రయించేట్లు చూడడం కోసం సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (బి) నిర్ధేశిస్తున్న రీతిగా, ఎవరూ కోరకుండానే వీలైనంత ఎక్కువసమాచారాన్ని ఇంటర్నెట్ తో సహా వివిధ ప్రసార సాధనాల ద్వారా క్రమానుగతంగా ప్రజలకు అందించేందుకు కృషి చేయాలి.
(3) సబ్ సెక్షన్ (1) నిర్ధేశిస్తున్న విధంగా వ్యవహరించేటప్పుడు, ప్రతి సమాచారాన్ని ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండే రూపంలో, రీతిలో విస్తృతంగా వ్యాప్తి చేయాలి.
(4) అన్ని రకాల సమాచారాలను వ్యాప్తి చేసేటప్పుడు...ఉచితంగా లేదా ఎంత చౌకగా ఆ పని చేయగలం, స్థానికంగా వాడుకలో ఉన్న భాష సమాచార వ్యాప్తికి స్థానికంగా బాగా ఉపకరించే పద్ధతులు, సమాచారం తేలికగా, వీలైనంతవరకూ ఎలక్ట్రానిక్ రూపంలో కేంద్ర పౌర సమాచార అధికారికి/రాష్ట్ర పౌర సమాచారఅధికారికి అందుబాటులో