పుట:Telugu Right to Information Act.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(ii) రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవడం, వాటి నకలులు, సర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం (iii) సమాచార సంపత్తి సర్టిఫైడ్ శాంపిళ్ళు తీసుకోవడం (iv) డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కాసెట్లు రూపంలో లేక మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని పొందడం, అలాంటి సమాచారం కంప్యూటర్లోగానీ, మరో పరికరంలో గానీ నిక్షిప్తమై ఉంటే ప్రింట్ అవుట్ల ద్వారా దానిని పొందడం ఈ హక్కులో భాగం.
(కె) "రాష్ట్ర సమాచార కమిషన్" అనగా సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (1) కింద ఏర్పాటయ్యే రాష్ట్ర సమాచార కమిషన్.
(ఎల్) "రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్", "రాష్ట్ర సమాచార కమిషనర్" అనగా సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (3) కింద నియమితులయ్యే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్.
(ఎమ్) "రాష్ట్ర పౌర సమాచార అధికారి" అనగా సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద నియమితులయ్యే రాష్ట్ర పౌర సమాచార అధికారి, అదే సెక్షన్ లోని సబ్ సెక్షన్ (2) కింద నియమితులయ్యే రాష్ట్ర సహాయ సమాచార అధికారి కూడా ఈ కోవకే చెందుతారు.
(ఎన్) తృతీయ పక్షం అనగా అధికార యంత్రాంగం సహా, సమాచారం కోసం అభ్యర్థించే పౌరుడు కాక ఇతర వ్యక్తి ఎవరైనా.

ఛాప్టర్ II

సమాచార హక్కు, అధికార యంత్రాంగాల విధులు

3. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది.

4. (1) ప్రతి అధికార యంత్రాంగమూ

(ఎ) ఈ చట్టం ప్రకారం సమాచార హక్కు అమలయ్యేందుకు వీలైన రీతిలో తమ దగ్గరున్న అన్ని రికార్డులనూ పట్టికలు, పద సూచికలతో నిర్వహించాలి. కంప్యూటర్ లీకి ఎక్కించదగిన అన్ని రికార్డులలోని సమాచారం అందుబాటులీ ఉండేందుకు వీలుగా, వనరుల లభ్యతపై ఆదారపడి, సహేతుకమైన కాలపరిమితి లోపు ఆ రికార్డులలోని సమాచారాన్ని దేశవ్యాపిత నెట్వర్క్ లో ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలి.
(బి) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోగా కింది వాటిని ప్రచురించాలి.
(i) ఆ అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, పనులు, విధులు
(ii) దాని అధికారులు, ఉద్యోగులకున్న అధికారాలు, విధులు
(iii) పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్గాలతోపాటు, నిర్ణయ ప్రక్రియలో అనుసరించే విధానాలు,
(iv) కార్యనిర్వహణలో పాటించే పద్ధతులు
(v) దాని దగ్గర వున్న , లేక నియంత్రణలో ఉన్న, లేదా కార్యనిర్వహణలో దాని ఉద్యోగులు పాటించే నియమ నిబంధనలు, ఆదేశాలు, మాన్యువళ్లు, రికార్డులూ,
(vi) దాని దగ్గర ఉన్న, లేక నియంత్రణలో ఉన్న పత్రాల రకాలకు సంబంధించిన ప్రకటన.