పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీనాథుడే కాశీఖండంలో, అనేక వాద్యాది విశేషాలతో ఆనాడు ప్రదర్శనాలు ప్రదర్శించినట్లు వర్ణించాడు.

పల్లకి చక్కి కాహళము వంశము ఢక్క హుండక ఝుర్ఘరుల్
ఝల్లరి యాదిగా గలుగు శబ్ద పరంపర తాళ శబ్దమై
యుల్లసిలం బ్రబంధముల కొప్పుగ నాడుచు రగ్ర వేదిపై
బల్లవపాణు లీశ్వరుని బంటమహేశులు పూజ సేయగన్

నాట్యంలో దేశి, మార్గ నృత్యాలను గురించి శ్రీనాథుడు కాశీ ఖండంలో ఉగాహరించాడు. జిక్కిణిచిందు అనీ అది దేశీయ నృత్యమనీ దశావతార చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.

దురుపదంబులు మైసిరుల నొసగ -సరిగ నిరుగెల కుంచియల్ సవదరించి
పెక్కువగ జక్కి ణీకొపుద్రొక్కె వొక-జక్కని మిఠారి సరసతులు సొక్కి చూడ