పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాజనుల సమక్షంలో తన అభినయచాతుర్యంతో, అందచందాలతో అందర్నీ ముగ్దుల్ని చేస్తూ, ఆస్థానానికి ఒక నూతన శోభను చేకూరుస్తూ వుండేది. అనేక మంది పేద సాదలకు ధనాన్ని, వస్త్రాలను దానంచేస్తూ వుండేది. అందుకే కాటయ వేమన తన శాకుంతల వ్యాఖ్యానంలొ ఓ ఈ విధంగా వుదాహరించాడు.

జయతి మహిమాలోకాతీత: కుమారగిరిప్రభో
స్సదసి లకుమాదేవీ యన్య ప్రియాసదృ శీప్రియా
నవ మభినయం నాట్యార్థానాం తవోతి సహస్త్రధా
వితరతి బహూనర్థా వర్థివ్రజాయ సహస్రశ:

అని వ్యాఖ్యానించాడు. లకుమాదేవి రాజనర్తకి యేకాక, కొమరగిరి ప్రియాసదృశ ప్రియయట. లకుమను గూర్చి ఇంతకు మించిన ఆధారాలు చరిత్రలో లేవని కీ॥శే॥ శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు బహు పరిశోధస చేసి ఇంగ్లీషులో 'హిస్టరి ఆఫ్ రెడ్డి కింగ్ డమ్సు' అనే రెడ్డి రాజుల యుగాన్ని చిత్రించిన మహా గ్రంథంలో వ్రాశారు.

ఆనాడు ద్రాక్షారామ భీమేశ్వరుని అఖండ దీపాన్ని వెలిగించండం ఎంతో పుణ్య కార్యంగా ఎంచబడేది. ఆ కారణంచేతనే లకుమాదేవి క్రీ.శ. 1402 లో తన తల్లి దండ్రులకు పుణ్యావ్యాప్తి కోసం అఖండదీపాదానం చేసి విఖ్యాతి పొందింది.

కుమారగిరి లకుమల వసంతోత్సవ విహారాలు:

కుమార గిరీ, లకుమాదేవీ వసంతోత్సవంలో అతి మనోహరంగా విహరిస్తూ వుండేవారట. లకుమ తన నృత్య ప్రదర్శనాలతో, అంగసౌష్ఠవంతో, వయ్యారపు నడకలతో, వివిధ నాట్య భంగిమలతో అజంతా సుందరిలా కుమార గిరిని ప్రేక్షకులను ముగుల్ని చేసేదట. కుమారగిరి తన భార్యలతో పాటు లకుమాదేవి తోనూ, తదితర అంత:పుర స్త్రీలతోనూ జలక్రీడలు ఆడుతూ వుండేవాడు. ఈ క్రీడలన్నీ గృహరాజ సౌధంలో జరిగేవి. కుమారగిరి లకుమల ఆనంద భావనం కూడ ఇదే. కొండవీటిలో ఒక దిబ్బ గృహరాజదిబ్బ అనే పేరుతో కుమారగిరి