పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/756

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకోసారి నిజమైన ఎలుగుబంటిని కూడ మచ్చిక చేసి ఆడిస్తారు. ప్రేక్షకులకు సలాం చేయిస్తారు. దాని చేత గంతులు వేయిస్తారు. ఒక కర్రను అడ్డఆం పెట్టి ఆ కర్రను దాటిస్తారు. దానితో సర్కసు ఫీట్లను చేయిస్తారు. ఒకోసారి దానిని పిల్లల మీదికి ఉరికిస్తారు. దాని నెత్తి మీద దానితో టోపీ పెట్టిస్తారు. అది గంతులు వేసేటప్పుడు ఆ అడుగులను అనుకరిస్తూ డప్పులను వాయిస్తారు. ఈ డప్పుల వాయిద్యంతో ఊరు ఊరంతా ఆ ప్రదేశానికి కదిలి వస్తారు.

అలాగే ఎలుగుబంటి వేషధారులు కూడ నిజమైన ఎలుగుబంటి చేష్టలన్నిటినీ అక్షరాలా అనుకరిస్తారు. నిజమైన ఎలుగుబంటి వెంట్రుకలు జానపదులకు ఎంతో విలువైనవి. ఆ వెంట్రుకల్ని తాయెత్తులలో చుట్టించి మొలలకు కట్టుకుంటారు పురుషులు. స్త్రీలు ఆ తాయెత్తులను మంగళ సూత్రం త్రాడులో కడతారు. భయపడిన పిల్లలకు తాయెత్తు కట్టితే, చెడు జబ్బులు రావనీ, గాలి చేష్టలు అంటవనీ పెద్దల నమ్మకం. ఎలుగు బంటిని ముఖ్యంగా ఆడించే వారు ఎక్కువ మంది ముస్లింలంటారు ఆర్వీ.యస్ సుందరంగారు__ జానపద విజ్ఞానంలో.

కర్నాటకలో కొడగులో హరిజనులు, ముస్లింలు ఎలుగుబంటి వేషాలు ధరిస్తారట. దీపావళి, వినాయక చవితి, మొహరం వంటి పండుగలకు ఈ వేషాలను ధరిస్తారట.


కప్పల కావడి

నా చిన్న తనంలో కప్పల కావడిని చూశాను. ఒక కావడి భుజాన వేసుకుని రెండు ప్రక్కలా రెండు తట్టల్లో కప్పలను పెట్టి అవి ఎగిరిపోకుండా వేపమండలు వేసి ఇద్దరు ముగ్గురు స్త్రీలు బృందాలుగా ఏర్పడి వానాలమ్మ వచ్చేనూ, వరిచేలు పండేనూ అంటూ పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ వ్వాచించే వారు. కప్పలు బెకబెకమంటే