పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vii


అనసూయా దేవి, రాంబట్ల, జమున, వరదా ఆదినారాయణ, దూడల శంకరయ్య, భాగవతుల రామకోటయ్య, ఇంద్ర సేనారెడ్డి, పులికంటి కృష్ణారెడ్డి, లక్ష్మీనరసయ్య, కోసూరి పున్నయ్య, అరవేటి శ్రినివాసులు, మొదలైన ఎందరో కాదు మరెందరో కృషి చేశారు. వారందరికి వందనాలు.

నా ఈ గ్రంథాన్ని తమ ప్రచురణగా స్వీకరించిన తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య డా॥ సి.నారాయణ రెడ్డి గారికి, రిజిస్ట్రారు డా: ఎన్. శివరామ మూర్తిగారికి, ప్రస్తుత రిజిస్ట్రారు డా॥ బి. రామకృష్ణా రెడ్డిగారికి, ప్రత్యేక నిర్వహణాదికారి శ్రీ గోవిందరాజు రామకృష్ణా రావు గారికి, ప్రచురణల విభాగం నిర్వహకులు డా॥ టి గౌరి శంకర్ గారికి, ప్రచురణల విభాగపు పరిశీలకులకూ కృతజ్ఞతలు.

ఈ గ్రంథానికి రేఖా చిత్రాలను గీసి అందించిన ప్రసిద్ధ చిత్రకారులైన గంగాధర్, టి. వెంకటరావు, ఆంధ్రప్రభ చిత్రకారుడు కీ॥శే॥ ఆనంద్ కూ___

అత్యంత ఆదరాభిమానాలతో ముఖచిత్రాన్ని గీసి ఇచ్చిన సుప్రసిద్ధ చిత్ర కారులు డా॥ బాపు గారికి నా ఆభినందనలు.

రచయితగా నా యీ ప్రయత్నానికి, కృషికి, ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం అందించిన తిరుమల, తిరుపతి దేవస్థానం వారికి, గ్రంథాన్ని సుందరంగా ముద్రించిన క్రాంతి ప్రెస్ శ్రీధర్ గారికి, నాటక జానపద కళారంగాలలో నేను చేస్తున్న కృషికి, ప్రారంభంనుండీ నా వెన్ను తట్టి నన్ను ఉత్సాహపర్చిన డా॥ అక్కినేని నాగేశ్వర రావు, డా॥ యన్, టి రామరావు, డా॥ గుమ్మడి, శ్రీ పివి ఆర్ కె. ప్రసాద్, డా॥ వేణుమాధన్, సవేరా అధిపతి శ్రీ ఎ. వెంకట కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.

రాజకీయాలకు, కళలకూ, అంకితమైన నా జీవితంలో అజ్ఞాత హస్తంగా నిలిసి నాకు అండదండ లందించిన నాజీవిత భాగస్వామి, నా అర్థాంగి సీతారత్నంకు అభినందనాలు చెప్పకుండా వుండలేను.

జానపద కళా రూపాలలో, కళాసేవలో అవిశ్రాంతంగా కృషి చేసి అనంతాకాశంలో కలిసిపోయిన అజ్ఞాత కళాకారులందరికీ నా జోహారులు.