పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇంతవరకు గట్టిగా ఆ ప్రయత్నం చేసినవారు లేరు. సంగీత నాటక అకాడమీ లాంటి సంస్థ ఏవో రెండు సదస్సులు జరిపి రెండు సావనీర్లు ప్రచురించటం తప్పా వాటి గురించి అంతగా పట్టించుకున్నట్లు కనిపించదు.

ఎంతో మంది పరిశోధక విద్యార్థులు, జానపద విజ్ఞానంగురించి యం.ఫిల్. , పి.హెచ్.డిల కొరకు పరిశోధన చేశారే తప్పా, జానపద కళారూపాలకు సంబందించిన సమాచారం గురించి పరిశోధన చేయటం జరగలేదు.

జానపద కళారూపాలను సేకరించి ఒక చోటకు చేర్చి ప్రచురించిన ఈ తెలుగువారి జానపద కళారూపాలు గ్రంథమే ఈ కోవలో ప్రప్రథమ గ్రంథం.

ఎక్కడెక్కడో మారుమూల నున్న కళారూపాలను సాధ్యమైనంతవరకు ఏర్చి కూర్చిన జానపద కళారూపాల మాల ఇది. ఇది నా ప్రథమ ప్రయత్నం కాబట్టి ఇందులో కొన్ని కళారూపాలు చేరి వుండక పోవచ్చు. ఈ ప్రయత్నాన్ని భావి రచయితలు ఇంకా ముందుకు తీసుకుపోగలరని ఆశిస్తున్నాను.

ఈ నా కృషిలో ఎన్నో గ్రంథాలు, పత్రికలు నాకు తోడ్పడ్డాయి. ఇది నా ఒక్కడి ప్రతిభా కాదు. ఎందరో మహానుభావులతో కూడిన అందరిదీ ఈ కృషి.

ఈ నాడు పేరిణి నృత్యాన్ని శాస్త్రీయ కళారూపంగా నటరాజ రామకృష్ణగారు తీర్చి దిద్దారు. అలాగే కొంతమంది హరికథా గానం కూచిపూడి నృత్యం దేవదాసీ నృత్యం మొదలైనవి కూడా శాస్త్రీయ కళారూపాల్లాగానే భావిస్తున్నారు.

కానీ ఆనాడు, గొండ్లి, పేరిణి, ప్రేంఖణము మొదలైన వాటిని జాయపసేనాని దేశి కళారూపాలుగానే వర్ణించాడు. కూచిపూడి నృత్యం, హరికథా గానం, దేవదాసీ నృత్యం జానపద కళారూపాలుగానే వర్థిల్లాయి. జానపద కళారూపాల తరువాత వచ్చినవే శాస్త్రీయ కళారూపాలు. జానపదకళారూపం లేకుండా శాస్త్రీయకళారూపం లేదు. అందువల్ల ఈ కళారూపాలను జానపద కళారూపాలుగానే వివరించాను.

అలాగే ఆ యా కళారూపాలకు సంబందించిన బొమ్మలు కొంతవరకు సేకరించగలిగాను. లభ్యమైన కొద్ది మంది కళామూర్తుల ఫోటోలు మాత్రం ప్రచురించగలిగాను. ఈ నా ప్రయత్నంలో ఏ కళాకారుణ్ణి కావాలని విస్మరించలేదు.

జానపద కళారూపాలను వెలుగులోకి తేవాలని, తహతహ లాడిన కళాభిమానులు ఎందరో వున్నారు. అలాటి వారిలో డా॥ కె.వి. గోపాలస్వామి, పి.యస్.అర్. అప్పారావు, డా॥ బి. కృష్టంరాజు, ఎ.ఆర్.కృష్ణ, గోపాలరాజ్ భట్, డా॥ మొదలి నాగభూషణసర్మ , డా॥ అత్తిలి కృష్ణారావు., శ్రీ లక్ష్మీకాంత మోహన్, ప్రయాగ నరసింహశాస్త్రి, డా॥జయధీర్ తిరుమలరావు, వింజమూరు సీతాదేవి,