Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాల్గొంటారు; ఒక ప్రాంతానికే ప్రాముఖ్యం ఇచ్చే ఈ కళారూపం జాతీయ వుత్సవాలలోనూ విదేశాలలోనూ కూడా ప్రదర్శింపబడుతూ వుంది.

అభినయ విన్యాసం:

ముఖ్యంగా ఈ ప్రదర్శనాలు జాతర్లలోనే జరుగుతాయి. ఈ ప్రదర్శనం రాత్రి పూటే ప్రదర్శింపబడుతుంది. ప్రదర్శనమంతా అభినయ విన్యాసంతో తొణికిసలాడుతుంది. పాటకు తగిన తాళం, తాళంకు తగిన లయ, లయకు తగిన నృత్యం నోటితో పాట, ముఖంలో ఉత్సాహ వుద్రేకాలతో కూడిన సాత్విక చలనం కొట్టవచ్చినట్లు కనబడతాయి.

తప్పెట గుళ్ళు ప్రదర్శనం ఏ గ్రామంలో ఇవ్వదలచుకుంటారో ఆ గ్రామ పెద్దల వద్ద పావలా డబ్బులతో కొంచెం బెల్లం బజానాగా స్వీకరించి ఏ తేదీన ప్రదర్శనం ప్రదర్శించాలో నిర్ణయించుకుంటారు.

ఎక్కడ వుందీ కళారూపం?

ఎంతో ఉత్తమమైన ఈ కళా రూపం ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగర్, విశాఖ పట్టణం జిల్లాలో అధిక ప్రచారంలో వుంది.

విజయనగరం జిల్లాలో గజపతి నగరం తాలూకా, పల్ల పేట ... మురిపెల్ల గ్రామాలలో ఈ కళారూపం సజీవంగా వుంది. పెల్లాచిన నారాయణ, దుర్ల చినఅప్పల స్వామి నాయకత్వాన గజపతి నగరం వృత్తి కళాకారుల సమాఖ్య సహకారంతో నడుస్తూ వుంది.

ఈ కళకు గుర్తింపు కావలని డా॥ బి.ఎస్.ఆర్.మూర్తి దంపతులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు గజపతి నగరం చుట్టు ప్రక్కల నలభై గ్రామాలలో శిక్షణ పొందిన తప్పెటగుళ్ళు దళాలు వున్నాయి.

శ్రీకాకుళం పట్టణానికి దగ్గరలో వున్న షేరు మహమ్మదు పురంలో,

శిక్షణతో కూడిన ... కోన చిన్న వాడు ...ఆధ్వర్యంలో ఉత్తమంగా ప్రదర్శనాలిస్తూ వచ్చింది. చిన్న వాడు వయసులో పెద్ద వాడైనందువల్ల ఆ కార్యభారాన్ని... కోరాడపోతప్పుడు వహిస్తున్నాడు.