- వివిధ విన్యాసాలు:
లయానుగుణ్యమైన పాటలు పడుతారు. ఎన్నో భక్తి గేయాలతో పాటు దశావతారాలు, కృష్ణ లీలలు, సారంగధర చరిత్ర, చెంచీత, అమ్మవారి చరిత్ర లాంటి కథాగేయాలను కూడా పాడుతూ సన్ని వేశాల కనుగుణమైన అభినయాలను ప్రదర్శిస్తూ వారి వారి ప్రతిభను కనపర్చే విన్యాసాలు చేస్తారు.
వివిధ భంగిమల్లో తప్పెట్లు వాయించటమే కాక, ఒకరి మీద మరొకరు ఎక్కి ఒకని సహాయంతో రెండు వైపులా ఇద్దరు వ్రేలాడుతూ తప్పెటలు వాయించటం రెండు జట్లుగా విడి పోయి తప్పెట గుళ్ళు వాయిస్తూ వారి ప్రతిభను ప్రదర్శించటం అలాగే ఒక కుండ పైన ఒకరు నిలబడి అతని పైన మరొకరు నిలబడి గుళ్ళు వాయిస్తారు. విన్యాసాలలో లెగిరి అమాంతంగా క్రింద పడటం, మోకాళ్ళ మీద కూర్చుని విన్యాసంగా గుళ్ళు వాయించటం.
ఇలా ఈ ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపర్చే విధంగా నాలుగైదు గంటలు సాగుతుంది. పగటి పూట తమ వృత్తిని చూసు కుంటూ రాత్రి పూట ప్రదర్శనాలను ఇస్తారు. అలాగే రాత్రి పూటే శిక్షణ కూడా పొందుతారు. వారి వారి బిడ్దలకు చిన్న తనం నుంచే ఈ విద్యలో శిక్షణ యిస్తారు. ముఖ్యంగా తప్పెట గుళ్ళలో పురుషులే