పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/680

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డబ్బుతో అందరూ విందు ఏర్పాటు చేసుకుంటారు. పురుషులు ఇలా వ్వాచిస్తే స్త్రీలు చాపలు అల్లుతారు.

అర్థరాత్రి జోస్యం:

గ్రామంలో అర్థరాత్రి వ్వాచకానికి బయలు దేరిన బుడబుక్కల వారు ఆ సమయంలో వ్వాచించరు. అలా గ్రామమంతా పది రోజులు అలానే తిరిగి ప్రతి ఉదయమూ ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు, బియ్యం వసూలు చేస్తారు.

అర్థ రాత్రి బుడబుక్కల వాని ఆగమనం కొంచెం భయంకరంగా వుంటుంది. ఎవ్వరూ అతనిని చూడరు. అతను చెప్పే మాటల కోసం ఆసక్తితో ఎదురు చూస్తారు. ఎవరికి వారు, వారికి సంబంధించిన జోస్యం చెపుతారేమో నని ఎదురు చూస్తారు. 'ఆం శాంభవీ, అంబ పల్కు జగదంబా పల్కవే' అంటూ వారి వారి మనోభీష్టాలకు తగినట్లు చెప్పి వ్వాచించే బొందిలీ క్షత్రియులు ఈ నాటికీ పల్లెలలోనూ, పట్టణాలలోనూ కనిపిస్తూ వుంటారు.

బుడబుక్కల పగటి వేషం.

ఈ బుడబుక్కల వేషాన్ని పగటి వేష ధారులు అత్యంత శోభాయ మానంగా, అతి సహజంగా ప్రదర్శిస్తారు. వారు ఏ గ్రామంలో పగటి వేషాలు ప్రదర్శించదలచుకున్నారో అక్కడ ప్రప్రథమంగా బుడబుక్కల వేషంతోనే ప్రారంభించే వారు, ఇద్దరు ముగ్గురు బుడబుక్కల వేషాలు ధరించి ఢమరుకాలు అతి చాక చక్యంగా మోగిస్తూ ప్రతి ఇంటికీ వచ్చి వారి వారి జాతకాల జోస్యాలను చెపుతూ గ్రామ ప్రజలను ముగ్ధులను చేసేవారు. ఆసక్తిదాయకమైన బుడబుక్కల వేషం ఈ విధంగా ప్రారభమౌతుంది.

ఓం అంబ పల్కు జగదాంబ పల్కే _ జగదాంబా దుర్గి పల్కు, దుర్గాంబా పల్కే_ దుర్గాంబా. ఓంకారి పల్కు, వారాహి పల్కే _ శారదాంబా, జయము జయమౌతది రాజా జయమైతది రాజా. మేలు మేలు మేలౌతది రాజా మేలౌతది రాజా! మేలు మేలు మేలౌతది రాజా_అయ్యగారి కార్యం జయమౌతది_ అమ్మగారి కార్యం జయమౌతది.

అమావాస్య నాడే ఆదివారమున లచ్చి వారమే పొద్దున లచ్చి, లచ్చి ఇచ్చటే కాచుంటాది. మేలౌతది రాజా. శుక్రవారపు సంధ్యన లచ్చి. సుక్క బెట్టుకొని