పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/679

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తి ప్రచారం చేస్తూ, అనేక పురాణ గ్రంథాల నుంచి ఉదాహరణ లిస్తూ, సామెతలతో ప్రజలను మెప్పిస్తూ నైతిక బోధ చేస్తూ __

అంబ పల్కు జగదాంబా పల్కు
మా ఇష్ట దేవతా పల్కు

అని పొలిమేర దేవతను కట్టి, గ్రామ దేవతను కట్టి, కీడు పల్కే పక్షుల్ని, మేలు పల్కే పక్షుల్ని వేరు వేరుగా తెలిపి, కీడు స్వరూపాన్ని మేలు గల విశేషాల్ని తెలిపి ఎదుటి వారి మనసులో కలిగిన ఉద్దేశాలను వివరిస్తూ, జనరంజకమైన రామ జోగి పలుకులు వినండంటూ__

మహారాజ రాజ మర్థాండ తేజ
రవి కల్ప భూజ రాజసూత్రమా
శుభోజయం కలగవలె
మీ పని నయం వుండాలి
మా పని జయం ఉండాలి
రాను మా భారం
రక్షించుట మీ భారం.

అంటూ లబ్జుగా ప్రజలను ఆకట్టుకుంటాడు.

బుడబుక్కల కుటుంబాలు:

బుడబుక్కల వారు ఆంధ్ర దేశంలో సుమారు మూడు వేల కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం లోని, డాంపురం దగ్గర ఒకప్పుడు మూడు వందల కుటుంబాలు వుండేవట. క్రమేపి ఉపాధి కోసం నాలుగు ప్రక్కలు చెదిరి పోయారు. ప్రస్తుతం పది కుటుంబాల కంటే ఎక్కువ లేవని సూరిసెట్టి రాములు ఈనాడు విలేఖరికి వివరించాడు.

ఈ వృత్తి వారికి పరిధిలు లేవు. ఏ గ్రామంలో నైనా యాచన చేయవచ్చు. అయితే ఒకరు వెళ్ళిన గ్రామానికి మరొకరు వ్యాచనకు వెళ్ళారు. వారి అచార వ్వవహారాలు వేరుగా వుంటూ వారిళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు అయిదు రోజులు జరుగుతాయి. ఆ సమయంలో అందరూ మద్యాన్ని సేవిస్తారు. అలాగే వారి కులాచారం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే కుల పెద్దలు విచారించి వారికి జరిమానా విధిస్తారు. ఆ వచ్చిన