పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/672

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఎన్నీ పాటలు, ఎన్నో అడుగులు:

పైన వివరించిన విధంగా ఎన్నో అడుగులు, భంగిమలూ, వివిధ దశలలో ఈ విధంగా నడుస్తాయి, ఆది అడుగు _ రెండు పోట్లు _ మూడు మెలిక _ కులుకుడు _ కుప్పిడుగు _ పద్మ వ్యూహము _ పర్ణశాల మొదలైన వివిధ రకాల అడుగులతో శోభాయ మానంగా బృందాన్ని తయారు చేస్తాడు గురువు.

పైన వివరించిన అడుగులే కాక, గురువు నేర్పిన వివిధ రకాలైన భంగిమల్ని కూడ కళాకారులచే చేయిస్తాడు. వ్రాతలో కంటే ప్రతి భంగిమనూ ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆ ప్రత్యేకతను అర్థం చేసుకోలేము. అందుకే ఈ కళారూపాన్ని గురుకుల పద్ధతిలో తీర్చిదిదిద్దాలి. చెక్కభజన గూర్చి తెలిసిన పరిశోధకులు ఎడ్ల బాలకృష్ణా రెడ్డి గారు ఒకరు. జానపద పారమార్థిక గేయ సాహిత్యంలో చెక్క భజన కులుకు భజన, అని పేరు పెట్టారు. చెక్క భజన ప్రాచీన రూపం కులుకు భజన. మొత్తం భజనల్లో ఏడు రకాలున్నాయనీ తెలిపారు. హరి భజన _ ఊరి భజన _ కులుకు భజన _ పండరి భజన _కోలాట భజన _ సప్తాతాళ భజన _ వేదాంత భజన.

భజన అందరికీ సంబంధించిన జానపద కళారూపం. భజనంటే సేవ, భగవంతుని అనంతనామాలకు రూపగుణ మహిమల్ని రాగతా‌ళ యుక్తంగా తన్మయత్వంలో సమిష్టిగా కీర్తించటం భజన అంటారు.

ముక్తి కోసం భక్తి పాటలు:

చెక్క భజన ప్రారంభించే ముందు ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని ప్రార్థించి, తరువాత వరుసగా భక్తి పాటలు పాడుతారు. అలాంటి పాటల్లో.

అమ్మా రావమ్మా ఆది శక్తివి నీ వమ్మా
మమ్మూ దయ చూడమ్మా
వేడెద మనసున వేడెదమమ్మా
వేగమే కదలి రామ్మా.