పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/671

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది అడుగు _ రెండవ అడుగు _ మూడవ ఆడుగు, నాల్గవ ఆడుగు, ఇలా పది అడుగుల వరకూ వేయిస్తాడు.

రెండు పోట్లు పర్ణశాల _ కుప్పడుగు _ మూడవ ఉద్ది వెనుక మార్పు __ జోకు అడుగు _రెండు మెలికె _ మెలిక కుచ్చు పోటు, ఒంటి మెలికె _ పోకడుగు _ రెండు కుప్ప _ పోంచ్ అడుగు _ బైస్కిల్ అడుగు _ గుఱ్ఱపడుగు _ వల అడుగు _ చిన్న సౌకం_ ఒంటి బేరి _ మూడవ బేరి _ నాలుగు వైపుల ఒంటి మెలిక, చుక్కల పందిరి ఉద్ది పోటు _ పది హేను పోట్ల అడుగు _ పద్మ వ్యూహం _ నాలుగు వైపుల కుప్ప _ డబుల్ వర్ణశాల. బజారు అడుగు _ కట్టె అడుగు _ కప్ప అడుగు_ వాలము అడుగు _ మూడు మెలిక _ ఒంటి మెలికె _ నాలుగు కులుకుడు _ ఇంట్లోకి బయటికి _ లోపలి మెలిక బయట మెలిక పద్మ వ్యూహం _ బేరి మూడు _ పందపుటడుగు _ యనకల రెండు పోట్లు _ జముడు అడుగు _ పెన అడుగు _ గుఱ్ఱపు టడుగు _ ఒంటి మెలికలో రెండు పోట్లు మొదలైన అడుగులలో కొన్నింటిని వివరించటం జరుగుతుంది. అడుగు లన్నిటినీ అక్షర రూపంలో చెప్పటం కష్టమనీ, ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుసు కోవచ్చుననీ లేదా వీడియో కేసెట్ ద్వారా అడుగుల్ని భద్ర పరిస్తే నేర్చుకోవటానికి అనువుగా వుంటుందనీ డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డిగారు తమ చెక్క భజన గ్రంధంలో విపులీకరించారు. వారికి ధన్య వాదాలు.

చెక్క భజన ఇలా ప్రారంబిస్తారు:

భజన ప్రారంభించే ముందు దేవుని పటాలకు పూజ చేస్తారు. టెంకాయ కొట్టి చిరుతలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందరూ వలయాకారంగా నిలబడి అందరూ లయతో చెక్కలను మోగిస్తారు. గురువు పాడగా వంత పాడతారు. తరువాత ఒక్కొక్క అడుగు వేయిస్తాడు. అలా కుడికాలుతోనూ, ఎడమకాలితోనూ, చాక చక్యంగానూ ఆడిస్తూ వుంటారు. అందరూ ఒకే విధంగా వాయిస్తున్న సమయంలో గురువు అకస్మాత్తుగా ఆగుతాడు. అందరూ అలాగే ఆపేస్తారు. అంతా నిశ్శబ్దం. ఆ సన్నివేశం అద్భుతంగా వుంటుండి. ఇలాంటి వాటిని నిలుపులు అంటారు. నృత్యం ఉధృతస్థాయిలో ఉన్నప్పుడు కూడ ఈ విధంగా నిలుపుదల చేస్తాడు. ఈ నిశ్శబ్ధాలు, మళ్ళీ ప్రారంభాలు. బృంద సభ్యుల యొక్క కలయికనూ లక్ష్యాన్నీ, క్రమశిక్షణనూ, గురుభక్తిని చాటుతాయి.