పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/660

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శారద అని పిలుస్తారు. శారద అంటే సరస్వతి అనే పేరు సర్వ సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అదే పేరును ఈ భిక్షకులు తంబురాకు శారద అనే పేరు పెట్టుకున్నారు. అందువల్లనే వారు కథా ప్రారంభంలో శారదాదేవినే స్తోత్రం చేస్తారు.

పురుషుడు కథ చెపితే అతని భార్వ వంత పాడుతూ డక్కీ కొడుతుంది. ఒకోసారి ఇద్దరే కథ చెపుతారు. అయితే వీరిలో బహు భార్యాత్వం వుండడం వల్ల, ఇద్దరు భార్యలూ, వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీ వంతల్లాగా, జంగం కథల్లో గానీ, బుర్ర కథల్లో గానీ స్త్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహు భార్యాత్వం వల్ల, ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవిస్తున్నారు.

TeluguVariJanapadaKalarupalu.djvu
ఈనాటి సంప్రదాయక శారదకాండ్రు

వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగినట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి, సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.

వారు చెప్పే కథలు:

బాలనాగమ్మ ... రాములమ్మ ... ఎరుకల నాంచారి ... చిన్నమ్మ మొదలైన కరుణ రస ప్రపూరితమైన కథలతో పాటు 18 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాల్ని దద్దరిల్ల చేసిన సర్వాయి పాపడు కథనూ, అలాగే రెడ్డి వీరులకూ, వెలమ వీరులకూ