పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/644

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ బొమ్మలు పైభాగమంతా బొమ్మ ఆకారంగా వుండి లోపలి భాగం డొల్లగా వుండి బొమ్మ యొక్క కళ్ళ భాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలోకి దూరి, తలను దూర్చి నృత్యం చేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది.

కట్టా సూర్యనాయాయణ:

ఈ బొమ్మలను తయారు చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన కట్టా సూర్యనారాయణ, బుట్ట బొమ్మల తయారీలో నేర్పరి.

ఆయన బొమ్మల తయారీని తన తండ్రి యల్లయ్య వద్ద నేర్చుకున్నాడు. యల్లయ్య 1930 లో దసరా వుత్సవాలకు మైసూరు వెళ్ళి, బుట్ట బొమ్మలు చూసి వాటి తయారీ నేర్చుకొని వచ్చాడు.

ఈ బొమ్మల తయారీకి చింత గింజలు, వెదురు ...రంగులు అవసరమౌతాయి. ఒక బొమ్మ తయారీకి నాలుగు కేజీల చింత గింజలు, రెండు వెదురు గడలు