Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/626

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని అనడాన్ని బట్టి బవనీలు ఈ రకమైన కథలు చెప్పడంలో ఎంతటి ప్రఖ్యాతి వహించారో తెలుసుకోవచ్చును.

వీరశైవ మతస్థులకు వినోదాన్ని కల్పించే వీరిని బైండ్లవారంటారు. కులాల వారీగా, మతాల వారీగా అచార్యులూ, కళాకారులూ వున్నట్లు వీరు కూడా కేవలం శైవమతస్థులకే వినోద ప్రదర్శన లిస్తారు.

వీరు శైవమతస్థుల ఇళ్లలో పెండ్లి మొదలైన శుభకార్యాలలోనూ, చావు మొదలైన దుర్దినాలలోనూ కథలను చెపుతారు. అయితే పెండ్లికీ, చావుకీ వేరువేరుగా వాయిద్యాలు వాయిస్తారు.

సంప్రదాయ కథలు చెప్పే బైండ్లవారు
సమిడికయే, జముకు.

బైండ్లవారు ఉపయోగించే వాయిద్యం జమిడిక. దీనినే కాలక్రమాన జిమిలిక, జముకుగా పిలుస్తున్నారు. నేటి జముకును చూసిన వారందరికీ జమిడిక ఎలా వుంటుందో ఊహించవచ్చు. కథకుడు మధ్యలో వుండి కథాగానం చేస్తూ వుంటే ప్రక్కన నున్న వంతలు జిమిడికల్ని వాయిస్తూ వుంటారు. ఈ జమిడికలు కొన్ని ఇత్తడితోనూ, మరికొన్ని కర్రతోనూ తయారు చేసుకుంటారు. జమిడిక వాయిద్యం నేటి జముకుల నాదం లాంటిదే. జుకజుం జుకజుం అని నినాదాన్నిస్తాయి. పాట వరుస ననుసరించి, ఈ వాయిద్యం మారుతూ వుంటుంది. సన్నివేశాన్నిబట్టి ఉధృతంగా వాయిస్తారు. అయితే బైండ్ల వారి కథల బాణీలకూ, జముకుల కథల బాణీకీ చాల వ్వత్యాసముంటుంది. బైండ్ల వారు తెలంగాణాలో ప్రాముఖ్యం వహిస్తే జముకుల