పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లా బాలావంతి చెప్పడం ప్రారంభించింది.

అవర్ సింగ్:__

మంకవతిని వెంటనే రప్పించాలి
సోదరుడు లింబోజీని కూడ పిలిపించాలి
ఆ లింబోజి అన్నకు ఈ రాజ్యం అప్పాగించాలి
పెద్ద చిన్న లంతా కూర్చున్నా రీ సభలో
కోమట్లూ బామండ్లూ కూడ కూర్చున్నా రిక్కడ
ఓ నారాణీ? నేనీ రాజ్యాన్ని ఎవరి కిచ్చేది?
అక్కడ అరెండు పైసల్ని ముడి వేయాలి
ఒక్క పైసను మాత్రం నేను ఒడిలో కట్టుకుంటాను.

ఇలా వారి సంవాదం జరుగుతుంది. ఈ ప్రదర్శనాలను ఈ నాటికి వారు ఆంధ్రదేశంలో ప్రదర్శిస్తున్నారు. మన జానపద కళారూపాలు ఎలా శిధిలమై పోతున్నాయో గొంధళే వీధి భాగోతాలు కూడ నశిస్తున్నాయి. అవీ మన కళారూపాలతో పాటు పెరిగాయి గాబట్టి వాటిని

సంరక్షించాల్చిన బాధ్యత వుంది. ఈ గొంధళే వీథి భాగోతాలను పరిశోధించిన పేర్వారం జగన్నాథం గారికి కృతజ్ఞతలు.