పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆసక్తి లేక అంతరిస్తున్న కళ:

అయితే ఈనాతి యువతరం ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని చూపడం లేదు. అందుకు ముఖ్య కారణం ఈ విద్యను నేర్చుకోవడం అతి కష్టమైనది కావడమే. అంతే కాక ఈకళ ద్వారా జీవించగలమనే నమ్మకం లేక పోవడం వల్ల తరతరాలుగా వస్తున్న ఈ పారంపర్య కళను వదలి, నేటి యువతరం ఇతర జీవన విధానాలను వివిధ వృత్తులనూ

అవలంబిస్తున్నారు. అందువల్ల ఈ కళను ప్రభుత్వం తప్ప మరెవరూ పోషించే అవకాశం లేదు.

మన కళలు జాతికి జీవనాడులు లాంటివి. పరిపూర్ణ కళాస్వరూపమై జానపదులకు అత్యంత సన్నిహితమై రసాను భూతినీ, ఆత్మానందాన్ని

కలిగిస్తున్న ఈ తూర్పు భాగవతబాణీని క్షీణించకుండా చూడ వలసిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఎంతైనా వుందంటారు డి.వై. సంపత్ కుమార్ గారు.