Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/605

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గంగిరెద్దుల అలంకారం:

గంగిరెద్దుల్ని స్వంత బిడ్డల్లా చూస్తారు. వాటిని ఎన్నో రకాలుగా అలంకారిస్తారు. మూపురం వద్ద నుండి తోక వరకూ ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. రంగులతో కొమ్ములను అలంకరిస్తారు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడుగుతారు. మూతికి తోలుతో కుట్టబడిన శికమారును కడతారు. నొసటి భాగాన అందమైన తోలు కుచ్చులను కడతారు. మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగ వేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును కడతారు. కాళ్ళకు గజ్జెలు కడతారు.అప్పుడు చూడాలి ఆ బసవన్నల అందం. సాక్షాత్తూ నందికేశ్వరుని పోలి వుంటుంది.

ఆడించే వారి హంగులు:

గంగిరెద్దుల వారి హంగులు, శ్రుతి సన్నాయి బూర, డోలు, చేతిలో కంచుతో చేయబడిన చిన్న చేగంట, వేషధారణలో నెత్తికి రంగుల తలగుడ్డ మూతిమీద కోర మీసాలు, చెవులకు కమ్మల జోడు, వారు వీరు ఇచ్చిన పాత కోటు, భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు, నుదురున పంగనామంతో సైకిల్ పంచ కట్టుకట్టి ఆకర్షణీయంగా తయారౌతారు.

సుందర ప్రదర్శనం:

గంగిరెద్దుల వారికి ప్రతి వూరిలోనూ మధ్యనున్న పెద్ద బజారే వారికి రంగస్థలం. ముందుగా గ్రామంలో ప్రవేశించి, గ్రామ పెద్దల నాశ్రయించి వారి అనుమతితో ప్రదర్శనం ఏర్పాటు చేసుకుంటారు.వారి వాయిద్యాలతో రణగొణ ధ్వనులు చేసి ప్రజలను రప్పిస్తారు. ఆ రోజుల్లో గంగిరెద్దుల ఆటలంటే మహదానందంతో హాజరయ్యేవారు.

ప్రేక్షకులందరూ మూగిన తరువాత గంగిరెద్దులను మేళతాళాలతో బరినంతా తిప్పుతూ స్వాగతం పలికిస్తారు. ఎద్దు నోటిలో మెడను ఇరికించి అదృశ్యాన్ని అందరికీ చూపిస్తారు. వాయిద్యానికి అనుకూలంగా గజ్జెల కాళ్ళతో నృత్యం చేసేది, పడుకోమంటే పడుకునేది, లేవమంటే