రివాజు ఈ వాలకం నుంచే పుట్టిందంటారు రాంభట్ల కృష్ణమూర్తి గారు. (నాట్య కళ, జానపద కళోత్సవ ప్రత్యేక సంచికలో.)
అసలే మూర్ఖుడు, అందులో తాటాకులు కట్టించుకున్నాడు. ఇతగాడి రంగ ప్రవేశంతో ఇతర వాలకాలు కట్టే కోడె గాళ్ళకు జంకూ గొంకూ పోతుందట. తాటాకు మండినంత వరకే ఈ వాలకం జరుగుతుందట. మంట ఆరిపోగానే కొరివిని ఎవరికైనా కొట్టేసి గుంపును చీల్చుకుని జర్రున చీకటిలో కలిసి పోతాడట వాలకం గాడు.
- నిష్క్రమణ, ప్రవేశం:
కమ్మ వాలకం నిష్క్రమించగానే, మరో వాలకం వెంటనే రంగ ప్రవేశం చేస్తుంది, ఈ వాలకాలలో అనేక రకాలున్నాయి. కొన్ని ప్రయోజనం కలవీ,మరి కొన్ని కేవలం వినోదాత్మకాలు. ప్రధానంగా ఈ రెండే ప్రాముఖ్యం వహిస్తాయి.
విదూషకులు, పగటి భాగవతులు ప్రదర్శించే అరవై నాలుగు జాతీయాలలాగే ఈ వాలకాలు కూడా అరవై నాలుగు జాతీయాలంటారు రాంబట్ల వారు. అయితే విదూషకుల వృత్తి పెద్ద దొరలకు నినోదం కలిగించడం, వారి మెప్పు పొందటం, వారి పారితోషికాలు అందుకోవడం, అందువల్ల అవి పెద్ద ప్రయోజనం కలవి కావు. ఈ వాలకాలు సామాన్య ప్రజలు కట్టేవి.
- అల్లెలోకి కోడెగాడి ప్రవేశం
ఒక కోడెగాడు అల్లెలోకి వస్తాడు. ఆహార్యం అలంకరణా ప్రత్యేకంగా లేక పోయినా, అ నడకా, ఆ వాలకం, అదీ చూసి అతగాడు కరణం అని అంతా ఇట్టే పోల్చుకుంటారు.
ఏంవోయ్ అప్పలస్వామి: బొత్తిగా ఔపించడం లేదేంవిటి? అన్న ప్రశ్నతో ఆ మాట తీరూ, ఆ నొసటి విరుపూ అచ్చం కరణంగారే అని ముసిముసి నవ్వుల మధ్య వాక్యాలు వెలువడతాయి.
- వాలకాల ఇతి వృత్తం:
కరణంగారు పన్నుల పంతులు. పన్నులు వేసేవారు సంపన్నులు. పన్నులు కట్టేవారు ఆ పన్నులు. గాలి వీస్తే పన్ను, ధూళీ వీస్తే పన్ను అని పన్నుల పన్నాలు చదువుతాడు కరణం, కరణం గారి శిస్తు ముందు, సర్కారు వారికి శిస్తు తర్వాత ఇదీ