పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/591

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాలకం యొక్క ఇతి వృత్తం సమకాలీన సమస్యలకు సంబంధించి వుంటుంది. జటిల హీన సాంఘిక సమస్యలకు పరిష్కారాలను కూడ చూపిస్తుంది. సంభాషణలు అతి చాతుర్యంగానూ, హాస్య ప్రధానం గానూ, చతురోక్తులతో కూడినవిగా కూడా వుంటాయి. ముఖ్యంగా యక్షగానం, వీధి నాటకాలలో మాదిరి విదూషకుడు ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాడు. ఈ కళారూపంలో వాలకం విజ్ఞాన దాయకమైన, వినోదాత్మకమైన విశిష్ట కళారూపం. సంఘంలో వున్న కుళ్ళును అద్దం పట్టినట్లు చూపించి, ప్రేక్షకులకు కనువిప్పు కలిగిస్తుంది. పై అధికారుల నుండి పల్లెటూరి అధికారుల పెత్తందారుల వరకూ అందరి అవకతవక బ్రతుకుల్నీ ఎండ కడుతుంది. అయితే ఈ ప్రదర్శనాన్ని ఎవరు బడితే వారు ప్రదర్శించడం కష్టమే. ఎందు కంటే ప్రదర్శించే వారికి సమయ స్పూర్తి, చాకచక్యం చాల అవసరం. అదీ గాక వ్రాత పూర్వకమైన ఇతి వృత్తాలు లేక పోవడం వల్ల ఈ కళా రూపం యొక్క సంప్రదాయాన్ని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

రాంభట్ల వారి వివరణ:

శరదృతువు రాగానే పల్లెల్లో గవిరమ్మ సంబరాలు జరుగుతాయి. గవిరమ్మ సంబరాల్లో ఊరి మధ్య ఘటాలు నిలుపుతారు. ఘటాల కెదురుగా ఆరు బయలులో జనమంతా వలయాకారంగా గుమికూడతారు. వాలకాలు మొదలయ్యే ముందు మూర్ఖుడైన కోడెగా డొకడు మండుతున్న తాటాకు మొలకు కట్టుకొని లంకా దహనం చేసే హనుమంతునిలా అల్లెలోకి ఉరుకుతాడు.అల్లెంటే వలయాకారంగా గుమికూడియున్న జనం మధ్యలోకి అనుకోవచ్చును.

కమ్మ వాలకం ప్రారంభం:

అల్లెలో దూకిన మూర్ఖుడు గవిరెమ్మ అమ్మవారి ఘనతనీ, సంబరాల ప్రాముఖ్యాన్ని పాడి పంటల సంపదలనూ, సమృద్ధినీ గ్రామలోని పెద్ద భుక్తలు, పెద్ద నాయుళ్ళు, పెద్ద సెట్ల ప్రతిభను చదువుతూ అల్లెలో గిర్రున తిరుగుతూ గుంపుచేత గుండ్రంగా పెండె కట్టిస్తాడు. యౌవనంలో వున్న పడుచు యువతుల్నీ వయసులో వున్న కోడెగాళ్ళను హెచ్చరిస్తూ పరాచికాలు ఆడుతూ, మొలకు కట్టుకున్న మండే తాటాకులతో జనంలోని వారిని ఒక్కొక్క చురక అంటిస్తాడు. తాటాకు చురక