పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/579

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉరుము అనబడే చర్మ వాయిద్యం ప్రాచీనమైంది. ఆదిమ జాతుల నర్తన రూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకర మైన శబ్దాలు సృష్టిస్తూ, వీరు చేసే నాట్య అతి గంభీరంగా వుంటుంది.

ఉరుముల వాయిద్యం ఒకేసారి ఏకధాటిగా వాయిస్తే కారుమొయిళ్ళు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ వ్వక్తమౌతుంది. అందుకే ఆ వాయిద్యానికి ఉరుము అని పేరు పెట్టారేమో ననిపిస్తుంది.

ఒక చేత వీరణం యొక్క చర్మాన్ని ప్రేము పుల్లలతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టిస్తారు. మరో చేతితో పుల్లతో లయ విన్యాసాలు తాళయుక్తంగా సాగుతాయి.

వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న. ఆయన మహాత్మ్య గాథలు ఉరుముపై దరువులు వేస్తూ గాన చేస్తారు. చరణానికి చరణానికీ మధ్య ముక్తాయింపుల్తో గంభీరమైన శబ్దాలు సృష్టించి వలయాకార విన్యాసాలు చేస్తారు:

వాయిద్యపు తీరు:

వాయిద్యాన్ని ఈ విధంగా ప్రారంభిస్తారు:

బూర్ బూర్ బూర్ బూర్
డబు డబు డబు డబు
యరడడ్డ బూర్ బరడ్డ్
డబు డబు డబు డబు

అని వాయిస్తూ పుల్లలతోనే చేతులెత్తి ప్రేక్షకులకు నమస్కారం చేసి పరాకు పరాకు అనే వచనాన్ని వల్లిస్తారు. తరువాత డప్ డప్ డప్; డప్ డప్ డప్; డప్ డప్ డప్ అంటూ వాయిస్తూ అందరూ వలయాకారంగా వుంటూ రెండు కాళ్ళను పెనవేసుకుంటూ శరీరాన్నంతా వూపుతూ ఎగురుతూ నృత్యం చేస్తారు. ఒక్కొక్క ధ్వనికి ఒక్కొక్క ఎగురు ఎగురుతూ మధ్య మధ్య, ఆహా, ఓహో అంటూ ఉరుములను ఉధృతంగా వాయిస్తారు.

కుంకాలాట:

ఉరుములు వాయిస్తూనే కుంచెల నృత్యం చేస్తారు. దీనిని కుంకాలాట అంటారు. నెమలి ఈకలతో కుంచెల్ని తయారు చేసుకుంటారు. ఈ కుంచెల్ని రెండు చేతులతో తల మీద వుంచుకుని వరుసగా నిలబడతారు. వీరు బావిలో మునిగి స్నానం చేసి వస్తారు. ఉరుము వాయిద్య సాగుతుండగా కళ్ళు మూసుకుని