పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/578

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉరుమును మించిన ఉరుముల నృత్యం

చితికి జీర్ణమైపోయిన అనేక జానపద కళా రూపాల ఈనాడు మనకు కనబడకుండా కనుమరుగై పోయాయి. అలా కనుమరుగైన కళారూపాలలో ఉరుముల నృత్యం ముఖ్యమైనది. తలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడల్లో కాసుల దండలు ధరించి ఎఱ్ఱని, పచ్చనివీ

TeluguVariJanapadaKalarupalu.djvu

శాలువలు కప్పుకుని, నిలువు అంగీలు ధరించి, పల్ల వేరు చెట్టు కర్రతో తయారు చేసిన ఉరుములకు చర్మపు మూతలు మూసి, కదర పుల్లలతో వాయించుకుంటూ దేవాలయ ప్రాంగణాల్లో, ఉరుముల నృత్యం చేస్తూ వుంటారు. ఉరుము అనే పేరును బట్టి వాయిద్య ధ్వని ఉరుమును పోలి వుండవచ్చును. అందువల్ల వాటికి ఉరుములు అనే నామకరణం చేసి వుండవచ్చు.

రాయల కాలంలో:

విజయనగర సామ్రాజ్య కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చినా కాలక్రమేణా అంతరించి పోయి, ప్రస్తుతం కుల వృత్తిని నమ్ముకుంటూ పొట్ట గడవని స్థితిలో డెబ్భై కుటుంబాల దాకా ఉరుములవారు అనంతపురం జిల్లాలో వున్నారు. వీరిని ఉరుములోళ్ళు అని కూడ పిలుస్తారు. వీరు మాల తెగలో ఎక్కువగా వున్నారు.