వాయించే వారు. మరి కొందరు నగారానూ, నౌబత్ ఖానా వాయిద్యాన్ని, కొమ్ము నాదాలనూ చేసి ఉత్సాహపర్చేవారు. వాయిద్య ధ్వనులను విన్నకొలదీ బరిలో వున్న పోరాట యోధులు రెచ్చిపోయి విద్యను ప్రదర్శించేవారు.
ఈ ప్రదర్శనాన్ని మూడు రకాలుగా ప్రదర్శిస్తారంటారు డా॥ బిట్టు వెంకటేశ్వర్లు గారు. ఒకటి కర్ర సాము, రెండు కత్తి సాము, మూడు ఏటా సాము. కర్ర సాములో బాణాకర్రల్లో ఒంటిబాణా, బోడిబాణా అని రకరకాలుగా వరుసలు త్రిప్పుతారు. ఎదుటి వాడు నెత్తిమీద కొడితే ఆ దెబ్బను తట్టుకోవడం, అలాగే గూడ దెబ్బకొడితే దానిని తట్టుకోవడం ఇలా తట్టుకుంటూనే ఎదుటి వాడిని దెబ్బ తీయటం. ఇలా పోరాడతారు.
- విన్యాసాలు:
ఈ కర్ర, కత్తిసాములో అందంగా, సుందరంగా ప్రేక్షకులను ఆనందపర్చే విధంగా రక రకాల విన్యాసం చేస్తారు. బాణాకఱ్ఱకు రెండు ప్రక్కలా కిరసనాయిలు ముంచిన గుడ్డలు చుట్టి వాటిని అగ్గి పుల్లతో ముట్టించి కుడి ఎడమ చేతుల్లో మార్చుకుంటూ తిప్పటం బాణా వరుసలో తిప్పటం.
అలాగే కత్తీ డాలూ ధరించి, రక రకాలుగా త్రిప్పి విన్యాసాలు చేస్తారు. ఒక మనిషిని క్రింది పడుకోబెట్టి అతని పొట్టమీద సొరకాయను పెట్టి పొట్టకు గాయం కాకుండా దానిని రెండు ముక్కలు చేయడం. అలాగే అరటి కాయను పెట్టి అలాగే చేయడం. ఇలా నరకడంలో ఏంతో చాకచక్యాన్ని చూపిస్తూ, అలాగే అరటి కాయను కంఠం మీదా నాలుక మీదా పెట్టి నరుకుతారు. అలాగే పొట్టపై కొబ్బరికాయ నుంచి బలంగా కొట్టి రెండు ముక్కలు చేస్తారు. అంతే కాక పొట్ట మీద తమల పాకును పెట్టి దానిపై ఒక పలుచని గుడ్డవేసి గుడ్డ తెగకుండా క్రింద నున్న తమలపాకును రెండు ముక్కలుగా చేస్తారు. ఇది ఎంత సున్నితంగా చేస్తారో వివరించడం కష్టం. దేనిని నరకటానికి ఎంత బలం ఉపయోగించాలో అలా కత్తిని ఉప యోగిస్తారు.
ఈ కర్ర, కత్తిసాము విద్యనూ, విన్యాసాలనూ విచిత్రాలను విజయనగరానికి చెందిన కరుమజ్జి సత్యం బృందం అత్యద్భుతంగా ఈ ప్రదర్శానాల నిస్తూ వుంది.