పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/565

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వరంగల్ జిల్లా జనగాం తాలూకా నెల్లుట్ల గ్రామ వాసి బండి ఈనయ్య, నల్లగొండ జిల్ల రామన్న పేట తాలూకా, ఆత్మ కూరు గ్రామవాసి, చర్ల కొండయ్య, వరంగల్లు జిల్లా జనగాం తాలూకా మాణిక్యాపురం గ్రామస్థుడు, చౌదరి పల్లి చుక్క సత్తయ్య.

వీరిలో చుక్క సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతిలోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడంలోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క

TeluguVariJanapadaKalarupalu.djvu

తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యులున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.


కత్తిసాములూ, కఱ్ఱసాములూ!


నా చిన్నతనంలో ఏ గ్రామంలో చూసినా వ్వాయామశాలలకు సంబంధించిన తాలింఖానాలు వుండేవి. ముఖ్యంగా వ్వవసాయ తరుణం అయిపోయిన తరువాత తీరుబడిగా వున్న సమయంలో గ్రామంలో వుండే యువకులందరూ పైన సూచించిన తాలింఖానాలలో చేరి కఱ్ఱసాము, కత్తి సాము, గరిడీలను చేసేవారు. వారు ముఖ్యంగా ఆత్మ రక్షణ కోసం ఈ విద్యను నేర్చుకునే వారు.

ఒకప్పుడు రాజాధి రాజులు తమ దేశ రక్షణకోసమూ, ఆత్మరక్షణ కోసమూ సైనికులకు శిక్షణ ఇచ్చేవారు. పాలకులు కూడ ఈ విద్యలో ఆరి తేరిన వారై యుండేవారు.

TeluguVariJanapadaKalarupalu.djvu
మారిని పరిస్థితులు:

రాజులు, సామంత రాజులూ, పోయిన తరువాత ఆంగ్లేయులు భారతదేశాన్ని హస్తగతం చేసుకున్న తరువాత అత్యాధునిక మారణాయుధాలు వచ్చిన తరువాత