Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/550

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంగతర్కం పాడేటప్పుడు, ఒకరు గంగ వేషాన్నీ, పరి ఒకరు కాటమరాజు వేషాన్నీ ధరించి ఎదురెదురుగా నిలబడి, చేతిలో కత్తి పట్టుకుని, ఆ కత్తి చివర ఒక నిమ్మ పండును గుచ్చి కాళ్ళలు గజ్జెలు కట్టుకుని, గంతులు వేస్తూ, కత్తిని త్రిప్పుతూ, రెండు పాత్రలూ వాదించుకుంటూ నటిస్తారు.

ప్రధాన కథకుడుతో పాటు వంతలు ముగ్గురుంటారు. వీరిలో ఒకడు కత్తిని పడతాడు. రెండవ వాడు వీరణాలను వాయిస్తాడు. మూడవాడు తాళం వేస్తాడు. ఈ ముగ్గురిలోనూ ఇద్దరు కథకు వంతగా ఆ కొడతారు. కాటమరాజు కథకులు పాడే పాట ఈ క్రింది విధంగా వుంటుంది.

గంగపాట:

గంగను కొలిచేరూ, ఏరువ
గంగను కొలిచేరూ
ఆకసాన సళ్ళాడు తురగా
గంగను కొలిచేరు, పాలేటి
గంగను కొలిచేరు.

అలాగే బొల్లావు పాట:

కనక రాళ్ళ బోటి మీద
కనక వర్షమూ ఆవుకు
కనక వర్షమూ.
ఉద్దాగేరి ముద్దాపసుపు
ఆవుకొచ్చెనూ
బొల్లావు కొచ్చెను.

అలాగే పాపనూక సువ్వి పాట.

సువ్వి సువ్వన్నలార, సువ్వన్నలార
సువ్వన్న పాపమ్మ వేయన్న పాడు
మచ్చావతారుడే మా ఆవులన్న
హెచ్చుగా దక్షిణాది ఆవుల మేపు
పచ్చొడ్లు నేదంచి పాలెసరబెట్టి