పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/548

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గుడారు:

ఏ ప్రదేశంలో కథను చెప్పాలనుకున్నారో ఆ ప్రదేశంలో పెద్దగుడారం వేస్తారు. ఆ గుడారం లోపల గోడలకు యాదవుల కైవశమైన గంగ,కాటమరాజు కథలోని ప్రధాన ఘట్టాలను రంగుల్లో చిత్రించబడిన పెద్ద పెద్ద గుడ్డలను అతికిస్తారు. ఈ గుడ్డలకు తెరచీరలని పేరు. ఈ తెరచీరలను బట్టే ఈ గాధాకారులకు తెరచీర భక్తులని పేరు.

కొమ్ము:

కొమ్ము అంటే ఇత్తడితో చేయబడిన కొమ్ము లాగా వంకరగా తిరిగి వుండే గొట్టాన్ని కొమ్ము అని పిలుస్తారు. కథను ప్రారంభించే ముందూ,

TeluguVariJanapadaKalarupalu.djvu

గోత్రాలను చెప్పే ముందూ, తానకములు పాడుతూ వున్నప్పుడూ ఈ కొమ్ముల్ని వుత్తేజంతో ఊదుతారు. ఈ కొమ్ముల ధ్వని శంఖారావం మాదిరిగా వుద్రేకాన్ని కలిగిస్తుంది. కొమ్ముల శబ్ధం వూరందరికీ వినబడుతుంది, ఈ నాదాన్ని విన్న వెంటనే ఎక్కడివారు అక్కడికి చేరుకుంటారు. కొమ్ము ధ్వని పిలుపు లాంటిది . కొమ్ములను ఊదే వారవటం వల్ల వీరిని కొమ్ముల వారని పిలవటం అలవాటై పోయింది.

వీరణాలు:

అంకమ్మ కథల్లోనూ, పల్నాటి వీర కథలలోనూ ఉపయోగించే పంబజోడు వంటివే ఈ వీరణాలు. ఇవి రెండుగా వుంటాయి. ఒకటి వేప చెక్కతో గాని, రేల