వారే ఆ నాటినుండి ఈ నాటి వరకూ ఈ గాథలను గానం చేస్తున్నారనీ తంగిరాల వారి ఊహ; వారినే ఈనాడు కొమ్ముల వారని పిలుస్తున్నారు.
ఎఱ్ఱగడ్డ పాటి పోట్లాట తరువాత "భక్తిరన్న" బీరి నీడు సంతతి వారైన మాదిగలను పిలిచి యాదవ కథల్ని లోకంలో వ్వాప్తి చేయటానికి అనుమతి ఇచ్చాడనీ చెపుతారు.
- కొమ్ములవారి ప్రదర్శన:
కొమ్ముల వారు ఏ యాదవుని ఇంటి ముందు కథ చెపుతారో, ఆ యాదవుడు వీరిని సన్మానించి తీరాలి. ఒక వేళ వారు అలా చేయక పోతే ఆతని ఇంటి ముందు ఒక గుడారాన్ని వేస్తారట. అలా చేయటం భక్తిరన్న శాసన మేనట. గుడారాన్ని, వేసినా, కొమ్ముల వారిని సన్మాని చక పోతే, ఆ గుడారాన్ని భక్తిరన్న కూల్చి వేయమన్నాడు. అలా గుడారాన్ని కూల్చటం వల్ల ఆ యింట్లో వున్న యాదవులందరూ నశించి పోతారని భక్తిరన్న శాపమట. అందువల్ల యాదవులు కొమ్ముల వారిని అమిత భక్తితో ఆదరిస్తారట.
కాటమరాజు కథలు పాడే వారికి అచార ప్రకారం ముఖ్యమైన ఆరు వస్తువులుండాలి. అవి గుడారు, కొమ్ము, "వీరణం", "బొల్లావూ","వీరద్రాడు", "బసవ దేవుడు" మొదలైనవి.