పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూడుస్తారు; దాని మీదగా గ్రామంలో వున్న పశువుల నన్నిటినీ తోలుతారు. వంశాచారంగా వస్తున్న మాదిగ వాడు, బొద్దు మీసంతో, విరబోసిన తలస్తో, వికటాట్టహాసంచేస్తూ కళ్ళెఱ్ఱ చేసి వంటి కంతా పసుపు పూసుకుని పదునైన పెద్ద ఖడ్గాన్ని చేత బట్టి ఎనుబోతు మెడ క్రింద పంగల కఱ్ఱను పోటీ గా పెట్టి,ఈ విధంగా ప్రారంభిస్తాడు.

పాట ప్రారంభం:

ఓరి, ఆది మూలము బ్రహ్మ
విష్ణు విగ్రహము మీద, ఆనంద మాడు వాడెవ్వడురా.............. ॥ఓరి॥

అఖిల దేవతలకు అభమయిచ్చిన వాడు
అలనాడు గోపంగి నేనేనురా, లింగతాలిల్లే తాలిల్లే..................... ॥ఓరి॥