పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నమ్మకాల మొక్కుబడులు:

గ్రామాల్లో విపరీతంగా వచ్చే కలరా మశూచికం, గొడ్ల జబ్బులకు, పంటల నాశనానికి కారణం, అమ్మవార్లనీ, అమ్మవార్లకు మ్రొక్కు తీర్చకపోతే అశాంతి అనీ, మ్రొక్కుబడి తీరిస్తే పాడి పంటలు గ్రామం సుభిక్షంగా వుంటుందనీ, గ్రామస్తులు నమ్మకం కొద్దీ మ్రొక్కుతూ వుంటారు. ఆ మ్రొక్కుబడులు తీర్చడానికే, అమ్మవారైన గ్రామ దేవతను తృప్తి పరచడానికే, ఈ జాతర్లూ, కొలువులూ, మ్రొక్కుబడులూ కోలాహలంగా చేస్తూవుంటారు. ఇలా మ్రొక్కుబడులను తీరిస్తే గ్రామ పొలిమేరల్లో అమ్మవారు గ్రామ రక్షణ కోసం కాపలా కాస్తుందని గ్రామస్తుల గాఢ నమ్మకం. ఆ నమ్మకం తోనే అమ్మవారి విగ్రహాలను నెలకొల్పి, నిత్యమూ పూజిస్తూ వుంటారు. కాని ఊరి ప్రజలందరూ ఆపద వచ్చినప్పుడు మాత్రమే పొలిమేరల్లో వున్న అమ్మవారికి జాతరచేస్తారు. అమ్మవారి పూజారి అనూచానంగా వస్తున్న ఆచారం ప్రకారం, ఆ రోజంతా ఉపవాసం చేసి, పొలిమేర గంగాణమ్మను తెచ్చి ప్రాతిష్ట చేస్తాడు. ఆ సందర్భంలో అమ్మవార్ల కథలను ప్రచారం చేసే పంబల వారు ఈ విధంగా పాటలు పాడుతారు.

పంబల వారి పాటలు:

గుమ్మడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి పూవు మీద
వాలిన చిలకలు వైకో గబ్బలు
ఘంట చిరిమువ్వల గైరమ్మ - నీ సుతుడేడే
వాడిన పువ్వులు ఒడిలో బోసుక
వాడలు వెతికితే లేడమ్మా
సరి, మేడలు వెతికిన రాడమ్మా॥

అంటూ, ముత్తైదువులు పసుపు, కుంకుమలను పళ్ళెములలో నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న చేతులను ఊపుకుంటూ చిరు నృత్యం చేస్తూ వస్తారు.

అమ్మవారిని పూజించి, ఊరిలో ఊరేగించి, తిరి పొలిమేరకు పంపే రోజున పెద్ద జాతర చేస్తారు. ఈ జాతర సమయంలో ఒక పందిని భూమిలో