పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాళం కొట్టేవాడు కాశీ పట్నం చూశావా అంటూ ప్రశ్నిస్తే, ఆ చూశానంటూ తల పూతుతాడు. అలా కొన్ని బొమ్మలను చూపిస్తాడు. ఈలోగా చాల మంది పిల్లలూ పెద్ద వాళ్ళు గుమి కూడతారు. ఎప్పుడెప్పుడు చూడాలా అని వాళ్ళూ వువ్విళ్ళూరుతారు. ఇలా ఒకరి తరువాత మరొకరు డబ్బులిచ్చి బొమ్మలను చూపిస్తారు. ఇలా రామాయణం, భారతానికి సంబంధించిన బొమ్మలనూ, పిల్లలకు వినోదం కలిగించే కోతుల్నీ, కొంగల్నీ, జంతువుల్నీ కూడ చూపిస్తూ వుంటారు. ఇలా అందర్నీ ఆకర్షించేటట్లుగా రకరకాల బొమ్మలను అమరుస్తారు. దీనిని పట్టపగలే పదర్శిస్తారు. ఎక్కడ పడితే అక్కడికి, జనం వున్న చోటికల్లా మారుస్తూ వుంటారు. లోపల బొమ్మలు కదలక పోయినా, బొమ్మలు కదులుతున్నత అంగికాభినయాన్ని హంగుదార్లు చేస్తూ వుంటారు. ఇలా వారు ఒక వూరి నుంచి మరో వూరికి సంచారం చేస్తూ పొట్టపోసుకుంటూ వుంటారు.

జంతరులో వున్న ఒకే ఒక ఆకర్షణ పెట్టెలో ఏ బొమ్మలున్నాయేనన్న ఆసక్తిని కలిగించటం వారు పాడే పాటలో వచ్చే కథనంతా బొమ్మలలో చూపిస్తారు. ప్రదర్శనాన్ని ఇలా ప్రారంభిస్తారు.

పైన తమాషా చూడరబాబు
 ఏమి లాహిరిగ వున్నది చూడు
ఏమి తమాషా లున్నయి చూడు
జంతర్ మంతర్ చూడర బాబు
జిబిజిబికిరి జిబిజిబికిరి జా .............. ॥పైన॥

కాశీ పట్నం చూడర బాబు
విశ్వనాథుని చూడ బాబు
కలకలలాడే గంగా నదినీ
కన్నుల పండగ చూడర బాబూ.......॥పైన॥

హరిశ్చంద్రుడు సత్యం కోసం
ఆలిబిడ్దలను అమ్మిన చోటూ
అడుగడుగుడుగో విశ్వేశ్వరుడు
హర హర యనుచును భక్తులు చూడు
చూచి మోక్షం పొందర బాబు..........॥పైన॥