Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీమవాసుల గొరవయ్యల నృత్యం

తలపైన ఎలుగుబంటి చర్మంతో తయారు చేసిన కిరీటం, ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో త్రిశూలం, మెడలో తెల్లని గవ్వల హారం, నడుము చుట్టూ జింక చర్మంతో అందంగా తయారు చేసిన సంచి.

అపురూపంగా కనిపించే ఈ వేషధారణం ఆంధ్రదేశంలో ఎక్కడా కనిపించక పోయినా, ఆనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుంది. వీరి వేషధారణ చూసి పిల్లలు భయపడితే, పెద్దవారు ఆసక్తి చూపుతూ వుంటారు. ఇంతకీ వీరు పేరు "గొరవయ్యలు" అని పిలుస్తూ వుంటారు.

కన్నడ దేశంలో శివభక్తులైన వారు, శివునిపై పాటలు పాడుతూ, ప్రతి ఇంటిముందూ, నృత్యం చేసి భిక్షాటనతో జీవితం సాగిస్తున్న ... గొరవయ్యలు కొన్ని శతాబ్దాల నుంచీ భిక్షాటనే వృత్తిగా మలుచుకొన్నారు. ఒకప్పుడు శైవమత