పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే కుందా దింసా. కుందా అంటే ఒకరి నొకరు భుజాలతో తోసుకోవడం అని భావం. ఈ నృత్యంలో లయబద్ధంగా ఊగుతూ, ఒకరి నొకరు భుజాలతో తోసుకుంటారు.

పథోర్ తోలా నృత్యం

బాయా దింసా నిసాని దేవత పూనినపుడు గణాచారి చేసే నృత్యమిది. బాయా అంటే పూనకం. గణాచారిని ఒరియాలో "గురుమాయీ" అంటారు. ఎవరైనా పూనినపుడు గ్రామస్తులందరు ఆ వ్వక్తి చుట్టూ చేరి తలలు వంచి నిలుస్తారు.

అలాగే "గురుమాయి" భవిష్యత్తులోజరగనున్న సంఘటనలను చెపుతారు. గూడెంలో ఎవరెవరు ధర్మం తప్పి చరించినది బయడ పెట్టడం కూడా జరుగుంది. ఇలా చెప్పే జోశ్యాలలో చాలవరకు నిజం కావడం విశేషం. జాన పదులు పూనకం వచ్చిన వ్వక్తిని అనుకరిస్తారు. గనుక ఈ నృత్యాన్ని బాయాదింసా అని వ్వవహరిస్తున్నారు. పూనకం తొలగే వరకూ ఈ నృత్యం కొనసాతుంది. (ప్రభుత్వ గిరిజన సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో)

మధురాలు:

మధురమైన పాటల్నీ, ఆటల్నీ, నృత్యాలను చేస్తూ కాల గడిపే మధురాలు, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో, అడవుల్లో, కొండల్లో ఈ మధురాలు ఎక్కువగా నివసిస్తున్నారని, విద్యారణ్యగారు ఆంధ్రపత్రికలో ఉదహరించారు.