పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/499

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అన్న పాటను వీరు పాడతారు. వీరి జీవితంలో మాట కంటే పాటే ప్రధానం. గంగాలమ్మ పండగలో ఓ అత్త కోడలిని ఇలా అంటుంది.

గైరికీపిట్ట కన్నుల దానా కోడలా, కోడలమ్మా
కారు పంది ముక్కు దానా కోడలా, కోడలమ్మా

అని పరిహసిస్తుంది


అరకులోయలో, ఆదిమవాసుల నృత్యాలు


మన ప్రాచీన సంగీత నృత్యాలు రూపు మాసి పోకుండా కాపాడిన ఖ్యాతి జానపదులకు దక్కుతుంది. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యం అత్యంత ముఖ్యమైనది.

రమణీయ ప్రకృతి:
TeluguVariJanapadaKalarupalu.djvu

అరకు లోయ రమణీయమైన ప్రకృతికి నిలయం. విశాఖపట్టణం జిల్లాలో సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తున వున్న ప్రాంత మిది. సంవత్సర కాలంలో ఎక్కువ కాలం వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా వుంటుంది. అనుకూల వాతావరణం వల్ల కాఫీ తోటలు, నారింజ తోటలు ఏపుగా పెరుగుతాయి. రకరాకల కూరగాయలు పండిస్తారు. అనేక గిరిజన జాతులు అరకు లోయ అంతటా కనిపిస్తారు. వీరందరూ ఆంధ్రదేశంలో వున్న ఎక్కువ మంది ఒరియా భాషను మాట్లాడుతారు. అయితే వీరు మాట్లాడే భాష స్వచ్ఛమైన ఒరియా భాష కాదు. వీరిలో వాల్మీకి బగట, బోండ్, కొండదార, కోటియా ప్రధానమైన గిరిజన జాతులు.

ఈటెల పండగ:

అరకు లోయలో అత్యంత ప్రధానమైన ఆనందోత్సవం, చైత్ర మాసంలో జరుగుతుంది. చైత్ర పర్వం, లేక ఈటెల పండుగ సందర్భంగా ఈ ఆనందోత్సవం జరుగుతుంది. పండుగ రోజుల్లో పురుషులు ఈటెలతోనూ, విల్లంబులతోనూ జంతువులను వేటాడుతారు.